త్వరలో పాకిస్తాన్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. రాజకీయ పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచార సభలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపిస్తున్నారు. శుక్రవారం బలూచిస్థాన్ లో జరిగిన బాంబ్ పేలుళ్లలో 128 మంది చనిపోయారు. 200 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
అయితే గతంలో పలుమార్లు భారత జాతీయ పతాకాన్ని తొక్కిన నేత కూడా ఈ బాంబుపేలుళ్లలో చనిపోయాడు. ఆవామీ పార్టీకి చెందిన ప్రముఖ నేత సిరాజ్ రైసాని పలు మార్లు భారతీయ జెండాను తొక్కి సోషల్ మీడియాలో పెట్టి వికృత ఆనందం పొందాడు. తాజాగా సిరాజ్ నిర్వహించిన సభలోనే ఉగ్రవాదులు బాంబులు పెట్టి రక్తంపాతం సృష్టించారు.
ఖైబర్ ఫంఖ్తూంఖ్వాలోని బన్ను అనే ప్రాంతంలో ముతహిత మజ్లీస్ అమాల్ పార్టీ నిర్వహించిన సభలోనూ ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. ఈ పేలుడులో 5 గురు మరణించగా.. 37 మందికి పైగా గాయపడ్డారు. కానీ పార్టీ ప్రముఖనేత అక్రంఖాన్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.