‘ఆర్ ఎక్స్ 100’.. పాయల్ పారితోషికం ఎంతో తెలుసా..?

297
Payal Rajput
- Advertisement -

‘ఆర్ ఎక్స్ 100’ అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన చిత్రం. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. రెగులర్ హ్యాపీ ఎండింగ్స్ తో రొటీన్‌కి అలవాటు పడిన ప్రేక్షకులు ఇందులో క్లైమాక్స్ ని తీర్చిద్దిన్న తీరుకు చాలా కొత్తగా ఫీల్ అవుతున్నారు. ఇక అందరి కంటే ఎక్కువ ఆకట్టుకుంది మాత్రం హీరోయిన్ పాత్ర. సినిమా చూసి బయటికి వచ్చాక అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా అనేలా పరకాయ ప్రవేశం చేసి మెప్పించిన పాయల్ రాజ్ పుత్ తన నెగటివ్ పాత్రకు పాజిటివ్ కామెంట్స్ రావడం పట్ల పట్ల ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

Payal Rajput

ఇలాంటి బోల్డ్ డేరింగ్ పాత్ర చేయాలంటే చాలా సాహసం ఉండాలని ఇవన్నీ తనలో ఉన్నాయి కాబట్టే కొందరు భయపెట్టినా ఆలోచించకుండా ఒప్పుకున్నానని చెప్పుకొచ్చింది ఈ బోల్డ్‌ బ్యూటీ. అయితే ఈ మూవీకిగాను పాయల్ రాజ్ పుత్ తీసుకున్న పారితోషికం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాలో యాక్షన్‌తో పాటు రొమాన్స్ పాళ్లు ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో లిప్ లాక్‌లు చాలనే ఉండడంతో అందుకు తగినట్టుగా ఆమె బాగానే డిమాండ్ చేసి ఉంటుందని అనుకుంటున్నాయి సిని వర్గాలు.

Payal Rajput

కానీ పాయల్‌ రాజ్‌ పుత్‌కు ఈ సినిమాకిగాను పారితోషికంగా ముట్టినది కేవలం 6 లక్షలేనట.ఈ మాట ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ విషయం గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. పారితోషికం కన్నా ఆ తరువాత వచ్చే ఛాన్సులపై ఆమె దృష్టి పెట్టి వుంటుందని చెప్పుకుంటున్నారు. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా సక్సెస్ అయ్యింది కాబట్టి ఇక హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు ఎలాంటి అవకాశాలు వస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -