Ram Mandir:అయోధ్యకు హైదరాబాద్ లడ్డూ

18
- Advertisement -

దేశమంతా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 22న అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనుండగా వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇక అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి కానుకలు వెల్లువలా వస్తున్నాయి.

తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు ఏకంగా 1265 కిలోల లడ్డూను తమారు చేశారు. కంటోన్మెంట్‌కు చెందిన శ్రీరామ క్యాటరింగ్‌ సర్వీసెస్‌ యజమాని నాగభూషణం ఈ లడ్డూను తయారు చేయగా ఇవాళ అయోధ్యకు తరలించనున్నారు. ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన రోజు నుంచి ప్రాణప్రతిష్టకు ఎన్ని రోజులు పట్టిందో అన్ని కేజీల లడ్డూ తయారు చేశారు నాగభూషణం.

ఇక ఇవాళ అయోధ్యకు చేరుకోనున్నారు బాల రాముడు. అరుణ్ యోగి రాజ్ రూపొందించిన శ్రీరామ విగ్రహాన్ని ప్రతిష్టించనుండగా భారీ ఊరేగింపు నడుమ బాలరాముడు అయోధ్య ఆలయ పరిసర ప్రవేశం చేయనున్నారు. ఇందుకోసం శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఏర్పాట్లు పూర్తిచేసింది. 18న శ్రీరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి ప్రవేశపెట్టనున్నారు.

Also Read:గవర్నర్ తమిళి సై ట్విట్టర్ హ్యాక్

- Advertisement -