ఈనెల 17 న 119 బిసి గురుకులాలు ప్రారంభం

317
gurulas
- Advertisement -

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక బీసీ గురుకుల పాఠశాలను ప్రారంభించనున్నట్లు నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. ఈనెల 17న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 119 బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నారు. కొత్తగా ప్రారంభమయ్యే వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 260బీసీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వరకూ రాష్ట్రంలో కేవలం 19 బీసీ గురుకులాలు మాత్రమే ఉండేవి.

మొత్తం గురుకుల పాఠశాలల్లో 5వేల335మంది టీచర్లు ఉండగా, 53 డిగ్రీ గురుకుల కళాశాలలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకులాల్లో 91వేల680మంది విద్యార్దులు చదువుకుంటున్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల తెలంగాణలో గురుకుల పాఠశాలలకు మహార్ధశ వచ్చిందని చెప్పుకోవచ్చు.. గురుకుల హాస్టల్లలో విద్యార్దులకు సన్న బియ్యంతో అహారం అందిస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా ప్రారంభమయ్యే 119 బీసీ గురుకులాలను నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు.

- Advertisement -