తెలంగాణ ప్రతిష్టను కాంగ్రెస్ నేతలు దిగజారుస్తున్నారుః ఎమ్మెల్సీ కర్నె

241
Karne-Prabhakar

తెలంగాణ ప్రతిష్టను కాంగ్రెస్ నేతలు దిగజారుస్తున్నారని మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. దేశంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమైందన్నారు . ఇవాళ ఆయన టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో ఇంత తొందరగా పనులు పూర్తైనా ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది కేవలం కాళేశ్వరం మాత్రమే అన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడో ప్రారంభించిన ప్రాజెక్ట్ లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఇంత అద్భతమైన కాళేశ్వర ప్రాజెక్ట్ ను స్వాగతించాల్సింది పోయి కాంగ్రెస్ నేతలు తమ దుర్బుద్దిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి రావద్దనడం కాంగ్రెస్ నేతల కుటిల నీతికి నిదర్శనం అన్నారు. గతంలో మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ప్రారంభానికి ప్రధాని మోదీని రావద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారని గుర్తుచేశారు. ఎక్కడయినా ప్రాజెక్ట్ లు కట్టినప్పుడు భూనిర్వాసితులు ఉండటం సహజమే అన్నారు. భూనిర్వాసితులకు చక్కటి ప్యాకేజి ఇచ్చినా కాంగ్రెస్ అనవసరంగా కోర్టుకు వెళ్లిందన్నారు. .శ్రీశైలం నిర్వాసితులు మాత్రం కాంగ్రెస్ హాయం లో న్యాయం జరగక ఇప్పటికి తిరుగుతున్నారని తెలిపారు. ప్రజలు టీఆర్ఎస్ కు అనుకూలంగా తీర్పునిచ్చినా కాంగ్రెస్ నేతల బుద్ది మారడం లేదని మండిపడ్డారు.