హ్యాపీ బర్త్ డే..అందాల కుష్బూ

198
khushbu actres

వయసు పెరిగినా తరగని అందం ఆమె సొంతం…స్టార్ హీరోలకు దీటుగా తన నటనతో మెప్పించి ఫైర్ బ్రాండ్‌గా దక్షిణాదిలో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న నటి కుష్బూ. ఇవాళ ఆమె బర్త్ డే సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.

కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కుష్బూ….. నేటితో 50 వ పడిలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోలతో నటించి మెప్పించిన కుష్భూ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు.

దాదాపు 9 ఏళ్ల తర్వాత పవన్ కల్యాణ్‌ అజ్ఞాతవాసి సినిమాలో నటించిన కుష్బూ తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందింది. తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

ఓ వైపు నటిగా రాణిస్తూనే మరో వైపు కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా రాణిస్తున్న కుష్బూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని గ్రేట్ తెలంగాణ.కామ్ మనస్పూర్తిగా కోరుకుంటోంది.