యుఎస్‌లో తెలుగు సాహితీ సదస్సు…

243
10th america telugu sahithi sadassu
- Advertisement -

సెప్టెంబర్ 23 -24 తేదీలలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు జరగనుంది. ఈ మేరకు ఆహ్వానసంఘం  పత్రికా ప్రకటనను విడుదల చేసింది. కుల,సంఘ, వ్యక్తిగత విభేదాలకు అతీతమైన ఈ  తెలుగు సాహిత్య సమావేశం జరగడం గత ఇరవై సంవత్సరాలలో ఇదే ప్రథమం. అందులో అమెరికా రాజధాని వాషింగ్‌టన్ డీసీలో మొదటిసారి జరుగుతుండటంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష సాహిత్యాలని అందరూ అభిలాషించాలనే సంకల్పంతో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, రాజధాని ప్రాంత తెలుగు సంఘం (సీఏటీఎస్‌)  ఈ సాహితీ సదస్సును నిర్వహిస్తోంది. గతేడాది సింగపూర్‌లో 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, హైదరాబాద్‌లో నిర్వహించిన 3వ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం, కాకినాడలో 2వ యువతరం సాహిత్య సమ్మేళనాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. వీటి స్పూర్తితో ఇప్పుడు అమెరికాలో 10వ తెలుగు సాహితీ సదస్సును నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఐదు దశాబ్దాలుగా ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్య వికాసంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మహిళా రచయితలని ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి సాహిత్య దృక్పథానికి పెద్ద పీట వేయడమే ఈ సద్సు ప్రధాన ఉద్దేశం.ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలు, పండితులు, విమర్శకులు ,వక్తలు,భాషాభిమానులు, తెలుగు భాషా సాహిత్యాల పురోగతిని ఆకాంక్షించే వారు హాజరై తమ హార్థిక,ఆర్ధిక సహాయం అందించాలని నిర్వాహకులు కోరారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఎంట్రీ ఫీజు $50 మాత్రమే. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సదస్సు జరగనుంది. ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి.  స్థానిక డల్లాస్ విమానాశ్రయం నుంచి హోటల్‌కి అక్కడి నుంచి సభాస్ధలికి ఉచితంగా బస్సు సౌకర్యం కూడా కల్పించారు.  సదస్సులో విడుదల అయ్యే కనీసం మూడు పుస్తకాలు (అమెరికా తెలుగు కథానిక -13వ సంకలనం తో సహా, సుధేష్ణ సోమ గారి నవల ‘నర్తకి’ తో సహా..)…రెండు రోజుల పాటు హాయిగా, సరదాగా వినోద భరితంగా, విజ్ఞానదాయకంగా, ఆసక్తి కరంగా ఉన్నత స్థాయి సాహిత్యం విందు….అన్నీ అంత తక్కువ ఖర్చులోనే.

భారత దేశం నుంచి తనికెళ్ళ భరణి, కవి జొన్నవిత్తుల, అచ్చ తెనుగు అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, ఖదీర్ బాబు, ద్వానా శాస్త్రి, దాసరి అమరేంద్ర, కన్నెగంటి అనసూయ వంటి రచయితలతో పాటు మేధావులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవనున్నారు.

సంచాలకులు: వంగూరి చిట్టెన్ రాజు & భాస్కర్ బొమ్మారెడ్డి
సదస్సు నిర్వాహక సంస్థలు: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & రాజధాని ప్రాంత తెలుగు సంఘము
గౌరవ సలహా దారులు: సుధేష్ణ సోమ, జక్కంపూడి సుబ్బారాయుడు, వంశీ రామరాజు (హైదరాబాద్)

- Advertisement -