ఆ జిల్లాలోని ప్రతి రామాలయానికి 100+1టిక్కెట్లు ఉచితం..!

53
- Advertisement -

మరో నాలుగు రోజుల్లో ప్రభాస్ ఫ్యాన్స్‌ ఎదురు చూపులకు తెరపడబోతుంది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌ సినిమాను జూన్‌ 16న విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ స్టార్ట్‌ అయిపోయాయి. హాట్ కేకుల్లా టికెట్స్‌ అమ్ముడవుతున్నాయి. నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ ఇప్పటికే అనాధ పిల్లల కోసం పదివేల టిక్కెట్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇదే వరుసలో నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ కూడా చేరారు. తాజాగా ఇదే కోవలోకి శ్రేయాస్‌ మీడియా కూడా చేరింది.

Also Read: స్టార్ హీరోయిన్లకు వేధింపులు

ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రతి రామాలయానికి ఉచితంగా 101టిక్కెట్లు ఇవ్వనున్నట్టు శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ ప్రకటించారు. రామయాణం ఇతిహాస నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. ప్రభాస్ రాముడిగా, సీతగా కృతిసనన్‌ నటించారు. కాగా రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్‌ నటించారు. హనుమంతుడిగా దేవదత్త నాగే లక్ష్మణ్‌గా సన్నీ సింగ్ నటించారు. రెట్రో ఫైల్స్‌ టీ సిరీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు దాదాపు రూ.500కోట్లు ఖర్చయింది. తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రిలీజ్‌ చేస్తుంది.

Also Read: 30న.. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘7:11 PM’

- Advertisement -