100 మిలియన్ల శ్రీమంతుడు..!

357
mahesh babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీమంతుడు. గ్రామాల అభివృద్ధి, ఊరిని దత్తత తీసుకోవాలనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది.

2015 లో విడుదలైన శ్రీమంతుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ2.0 బిలియన్లు వసూళ్ళు చేసింది ఈ సినిమా చూసిన తర్వాత సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఊరిని దత్తత తీసుకోవడం ప్రారంభించారు.

అయితే తాజాగా ఈ సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. యూ ట్యూబ్‌లో 10 కోట్ల వ్యూస్ సాధించి టాప్ ప్లేస్‌లో నిలిచింది. తెలుగులో ఇప్పటివరకు ఏ సినిమా 100 మిలియన్ వ్యూస్ దక్కించుకోలేదు.

- Advertisement -