చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా ప్రపంచవ్యాప్తంగా 209 దేశాలకు విస్తరించింది. సరిగ్గా వందరోజుల క్రితం అంటే డిసెంబర్ 31న తొలి కరోనా కేసు నమోదు అనతికాలంలోనే ప్రపంచదేశాలకు విస్తరించి ప్రపంచాన్నే షట్ డౌన్ చేసేసింది.
వివరాల్లోకి వెళ్తె..వుహాన్లో డిసెంబర్ 31న కరోనాను గుర్తించగా జనవరి 1న వుహాన్ సీఫుడ్ మార్కెట్‌ను షట్ డౌన్ చేశారు. వూహాన్‌లో వ్యాధికి కారణమేమిటన్న విషయం స్పష్టమైన కొన్ని రోజులకే ప్రాణాంతక కరోనా వైరస్ చైనా సరిహద్దులు దాటుకుని థాయ్‌లాండ్‌లో ప్రత్యక్షమైంది. వూహాన్‌లో ఉండే 61 ఏళ్ల వ్యక్తి ఒకరిలో జ్వరం లక్షణాలు ఉన్నట్లు బ్యాంకాక్ విమానాశ్రయ అధికారులు థర్మల్ స్కానర్ల సాయంతో గుర్తించారు. ఒకట్రెండు వారాల్లోనే చాలా ఆస్పత్రుల్లో కరోనా లక్షణాలున్న వారు భారీ సంఖ్యలో చేరుతున్నట్లు వూహాన్‌లో వెద్యులు గుర్తించారు.
తర్వాత కోరలు చాచిన కరోనా స్పెయిన్, ఇటలీలకు విస్తరించింది. అప్పటికే చైనాలో 258 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో చైనా వెళ్లి వచ్చిన వారిపై అమెరికాలో నిషేధం మొదలైంది.
జనవరి నెలాఖరుకల్లా వైరస్ భారతదేశంతో పాటు ఫిలిప్పీన్స్, రష్యా, స్వీడన్, బ్రిటన్‌లకూ విస్తరించింది. కేరళలో ముగ్గురికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. నేటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 16 లక్షలు దాటింది. 209 దేశాలకు కరోనా వైరస్ విస్తరించగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 96వేలకు చేరింది.
()31 డిసెంబర్ 2019: మొదటిరోజు 31 కేసులు,
() 09 జనవరి 2020 : 10వ రోజు 63 కేసులు, ఒకరి మృతి
() 19 జనవరి 2020: 20వ రోజు 122 కేసులు, 3 మరణాలు
() 29 జనవరి 2020 : 30వ రోజు 6,166 కేసులు, 133 మరణాలు
() 08 ఫిబ్రవరి 2020: 40వ రోజు 37,120 కేసులు 806 మరణాలు
() 18 ఫిబ్రవరి 2020 : 50వ రోజు 75,136 కేసులు 2,007 మరణాలు
() 28 ఫిబ్రవరి 2020 : 60వ రోజు 84,112 కేసులు, 2,872 మరణాలు
() 09 మార్చి 2020: 70వ రోజు 1,13,590 కేసులు, 3,988 మరణాలు
()19 మార్చి 2020: 80వ రోజు 2,42,570 కేసులు, 9,867 మరణాలు
() 29 మార్చి 2020: 90వ రోజు 7,20,140 కేసులు, 33,925 మరణాలు
()08 ఏప్రిల్ 2020: 100వ రోజు 15,11,104 కేసులు, 88,338 మరణాలు