సుజీత్‌ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్‌..!

198
chiru

మల‌యాళ సూపర్‌స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం లూసిఫ‌ర్‌. మలయాళంలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని హీరో పృథ్వీరాజ్ డైరెక్ట్ చేయడంతో పాటు కీరోల్ పోషించాడు. ఈ మూవీ తెలుగు రీమేక్‌ హ‌క్కుల‌ను మెగా పవర్ స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్ ద‌క్కించుకున్నార‌ు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు దర్శకుడు పృథ్వీరాజ్.

చిరు హీరోగా ఈ సినిమా తెరకెక్కనుండగా సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారో అన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే తొలుత సుకుమార్ తర్వాత వినాయక్‌ల పేరు తెరమీదకు వచ్చింది.అయితే తాజాగా టీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సుజీత్‌ తెరకెక్కించనున్నారట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి.

తెలుగు వెర్షన్ కి తగినట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయడంలో సుజీత్ బిజీగా వున్నాడని చిరు చెప్పుకొచ్చారు. గతంలో చిరు నటించిన రీమేక్ సినిమాలు హిట్లర్‌ , ఠాగూర్‌ , శంకర్‌దాదా ఎంబిబిఎస్‌ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టాయి. ఈ నేపథ్యంలో లూసిఫర్‌ కూడా హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.