టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కెరీర్‌లో భారీ విజయం సాధించిన సినిమాల్లో ‘దూకుడు’ ఒకటి. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. దూకుడు సినిమా సెప్టెంబర్ 23 ,2011 లో విడుదల అయ్యింది. నేటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకంది ఈ చిత్రం. మహేష్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన పోకిరి సినిమా అప్పటికే భారీ హిట్ అందుకుంది . అలాగే మహేష్ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా దూకుడు సినిమాలో ఆకట్టుకున్నాడు. దాంతో ఈ సినిమా పోకిరిని మించి విజయాన్ని అందుకుంది.
మహేష్ యాక్షన్, సమంత గ్లామర్ ఈ మూవీకి విజయంలో దోహదం చేశాయి. దూకుడు మూవీ భారీ విజయంలో క్రెడిట్ బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణలకు కూడా ఇవ్వాల్సిందే. ముఖ్యంగా బ్రహ్మానందం మరియు మహేష్ కాంబినేషన్ లో వచే కామెడీ ఎపిసోడ్స్ థియేటర్స్ లో ఓ రేంజ్ లో పేలాయి. ఈ చిత్రానికి థమన్ అందించిన సంగీతం మరో హైలెట్ నిలిచారు. మొత్తంగా కామెడీ, రొమాన్స్, యాక్షన్ అన్నీ కలిపి మహేష్‌కు బ్లాక్ బస్టర్ అందించాడు దర్శకుడు శ్రీను వైట్ల. ఈ చిత్రం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రెండ్ ను కూడా చేస్తున్నారు.
సినిమా షూటింగ్ హైదరాబాద్ మొదలుకొని ముంబై, గుజరాత్, ఇస్తాంబుల్, దుబాయ్, స్విట్జర్లాండ్, టర్కీ లాంటిప్ ప్రాంతాలలో జరిగింది. 35 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం 57.4 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్, 101 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మహేష్ కెరీర్ లోనే రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. విమర్శకుల ప్రశంసలతో పాటు ఏడు నంది అవార్డులు, ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకుంది.