ఆకాశవాణి @ U/A

229
aakashavani
- Advertisement -

విలక్షణ నటుడు సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ఆకాశవాణి. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్ పై పద్మనాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అశ్విన్ గంగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

విలేజ్ డ్రామాకు సెన్సార్ సభ్యులు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు. క్రూరమైన భూస్వామికి వ్యతిరేకంగా గిరిజనులు చేస్తున్న పోరాటాన్ని కొత్త నటీనటులతో చూపించబోతున్నారు. రేడియో ట్రాన్సిస్టర్ ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. కొద్ది రోజుల క్రితం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసి మేకర్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సోనీ లివ్‌లో సెప్టెంబర్ 24న విడుదల కానుంది.

- Advertisement -