వైఎస్ షర్మల పార్టీలో ఇప్పుడు కరోనా కలకలం రేపుతోంది. వైఎస్ షర్మిల ఉద్యోగ దీక్షలో పాల్గొన్న కొంతమంది కరోనా వైరస్ బారిన పడగా ఇప్పుడు అంతా ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు 10 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన వారిలో ఆందోళన మొదలైంది.
షర్మిల చేపట్టిన ఈ మూడు రోజుల దీక్షకు రాష్ట్ర నలుమూలల నుంచి చాలా మందే వచ్చారు. దీక్షలో షర్మిల వెంటే ఉన్న పిట్టా రాంరెడ్డికి, మరో ఇద్దరు షర్మిల అనుచరులు, సెక్యూరిటీ సిబ్బందికి వైరస్ ఉందని తేలింది. దీంతో షర్మిల ఐసోలేషన్‌లోకి వెళ్లగా దీక్షలో పాల్గొన్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
దీంతో షర్మిలతో కరచాలనం చేసిన వారితో పాటు ఆమె అనచరులను కలిసిన వారు టెస్టులు చేయించుకునేందుకు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. మొత్తంగా దీక్షతో షర్మిలమ్మ సాధించింది ఏంటో తెలియదు గానీ కరోనాతో మాత్రం ఆమె అనచరులు బాధపడాల్సిన పరిస్ధితి వచ్చిందని ఆ పార్టీ నేతలే గుసగుసలాడ లాడుకుంటున్నారు.