కరోనా ఎఫెక్ట్…మా ఇంటికి రాకండి!

37
covid

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతరూపం దాల్చుతోంది. రోజుకు రికార్డు స్ధాయిలో కరోనా కేసులు నమోదవుతుండగా పలు రాష్ట్రాలు తిరిగి లాక్ డౌన్ బాటపట్టాయి. మరికొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడంతో పాటు కరోనా నిబంధనలను మరింత కఠినతరం చేశాయి.

ఇక కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తమయ్యారు. గతేడాది లాక్‌డౌన్‌ సందర్భంగా వీధి వీధికి కంచెలు ఏర్పాటు చేయగా అపరిచితులు తమ కాలనీల్లోకి రాకుండా జాగ్రత్త పడ్డ సందర్భాలు చూశాం…ఇక పల్లెల్లో కూడా ఇదే పరిస్ధితి కనిపించింది. ఊర్లకు ఊర్లు కంచెలు వేసుకుని బయటి గ్రామాల ప్రజలకు తమ విలేజ్‌లోకి రాకుండా కాపాల కూడా కాశారు.

అయితే తాజాగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో దయచేసి మా ఇంటికి రాకండి… మీ ఇంటికి రానివ్వకండి అని విజ్ఞప్తి చేస్తూ పోస్టర్లు అంటిస్తున్నారు. మరికొంతమంది కలిసికట్టుగా పోరాడుదాం.. కరోనా మహమ్మారిని ఖతం చేద్దాం.. మాస్క్‌ ధరిద్దాం, భౌతికదూరం పాటిద్దాం అంటూ తమ ఇళ్ల ముందు ప్రజలకు అవగాహన కలిగేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరికొంతమందైతే ఎన్నికలున్న ప్రాంతాల్లో నాతో పని ఉందా.. అయితే సెల్‌ నంబర్‌కు ఫోన్‌ చేయండి. ఎన్నికల ప్రచారమా.. కరపత్రాలు పక్కన బ్యాగులో వేసి వెళ్లండి. ఇంట్లోకి మాత్రం రావద్దు.. అంటూ నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. ఏదిఏమైనా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ స్వీయ జాగ్రత్త పాటించకపోతే కరోనా మహమ్మారికి భారీ మూల్యం చెల్లించక తప్పదేమో.