- Advertisement -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దక్షిణ సుక్మా లోని భెజ్జీ ప్రాంతం కుంటా పోలీస్ స్టేషన్ పరిధిలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, మావోయిస్టుల మద్య శుక్రవారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు హతమయ్యారు.ఎన్‌కౌంటర్ ప్రాంతం నుంచి మూడు ఆటోమేటిక్ తుపాకులతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పేర్కొన్నారు.
ఉదయం నుంచి ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్లు సుందర్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మావోల కోసం వేట కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ ధృవీకరించారు.
Also Read:ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు…షర్మిల ఫైర్!
- Advertisement -