బన్నీపై కేరళ సీఎం ప్రశంసలు…

172
kerala cm

టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్‌పై ప్రశంసలు గుప్పించారు కేరళ సీఎం పినరయి విజయన్‌. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేరళ సీఎం సహాయనిధికి రూ. 25 లక్షలను బన్నీ అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని ప్రత్యేకంగా అభినందించారు కేరళ సీఎం.

కేరళ ప్రజలు ఆయనకు రుణపడి ఉంటారని…తెలుగు రాష్ట్రాలతో సమానంగా కేరళకు కూడా సాయం అందించాలన్న బన్నీ ఆలోచన చాలా గొప్పగా ఉందని కొనియాడారు.

బన్నీకి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలో గొప్ప ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కేరళలో బన్నీ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనాపై పోరులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు ఇచ్చిన బన్నీ కేరళకు రూ. 25 లక్షల సాయాన్ని అందజేశారు.