ఆల్బమ్‌గా వెంకన్న పాటలు…

625
- Advertisement -

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కాళోజీ….అలాంటి పురస్కారం గోరెటి వెంకన్నకు రావటం ఆనందంగా ఉందని స్పీకర్ మధుసుదనాచారి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతి రవీంద్రభారతిలో కాళోజీ నారాయణరావు 102వ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రజా గాయకుడు గోరేటి వెంకన్నకు కాళోజీ నారాయణరావు 2016 అవార్డు ప్రధానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా సన్మాచించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకన్న….సీఎం కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు.తనదైన శైలిలో పాటలు పాడి సభికులను అలరించారు.

అన్యాయం,దోపిడిపై కాళోజి దిక్సూచిగా నిలిచిండని…కాళోజి సంకలనాలు…గేయాలు ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు మధుసుదనాచారి. గోరెటి వెంకన్నకు కాళోజి పురస్కారం ఇవ్వడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు.భావితరాలకు గోరెటి పాటలు అందించాల్సిన అవసరం ఉందని… తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ఇవ్వాలని సీఎంని కోరతానని కడియం తెలిపారు.గోరెటి పాటలను ఆల్బమ్‌గా తీసుకోస్తామని..వరంగల్‌లో కాళోజి కళాక్షేత్రానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.బతికినంత కాలం తెలంగాణ కోసమే బతికిన కవి కాళోజీ అని కొనియాడారు సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్‌. ప్రజా కవి గోరేటి వెంకన్న పాటలు తెలంగాణ పల్లెల జీవం. వెంకన్న పాట ఎప్పటికీ సజీవంగా ఉంటుందని తెలిపారు. కాళోజీ అవార్డు…మళ్లీ కాళోజీకే వచ్చినట్లు ఉందన్నారు.

రచయిత, గాయకుడు గోరెటి వెంకన్నకు కాళోజీ పురస్కారం రావడం సంతోషంగా ఉందని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. వెంకన్న ప్రజల గొంతుక అని…. పల్లె ప్రజల గోసను వెంకన్న పాటల రూపంలో చెప్పారన్నారు. వెంకన్న పాట పాడితే ప్రజానీకం ఏడ్చారు అని తెలిపారు. కాళోజీ అంటే వ్యక్తికాదు శక్తని…. కాళోజీ మనకాలం వేమన అని కొనియాడారు దేశపతి శ్రీనివాస్. కాళోజీ భావనల ప్రతిరూపం నాగొడవ మహాకావ్యం. చరిత్ర గమనానికి కోళోజీ సాక్షి. యమున్ని సైతం ధిక్కరించే ఖలేజా ఉన్న కవి కాళోజీ అని తెలిపారు. పేదల గుండెల దుఃఖాన్ని వినగలిగిన కవి గోరేటి వెంకన్న. తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారడానికి కవిగా, వాగ్గేయకారుడిగా వెంకన్న ఎంతో కృషి చేశారని చెప్పారు.

https://youtu.be/puPs54v-eTA

- Advertisement -