రూ.13,000 కోట్ల మేర జరిగిన భారీ ఆన్‌లైన్ గేమింగ్ మోసం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో అడసమ్ అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు పంకజ్ కుమార్‌ను DGGI అధికారులు అరెస్ట్ చేశారు.
దర్యాప్తు ప్రకారం, నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి, షెల్ అకౌంట్‌లకు ఫేక్ KYC వెరిఫికేషన్ నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అకౌంట్‌ల ద్వారా అక్రమ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్లు నడిపి, యూపీఐ మరియు పేమెంట్ గేట్‌వేలు ఉపయోగించి భారీ మొత్తంలో డబ్బులు సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో పన్ను ఎగవేతతో పాటు మనీ లాండరింగ్ అంశాలు కూడా ఉన్నాయని అనుమానిస్తున్నారు.
దర్యాప్తు భాగంగా పంకజ్ కుమార్‌కు చెందిన బ్యాంక్ ఖాతాల్లోని సుమారు రూ.100 కోట్లు ఫ్రీజ్ చేశారు. డిజిటల్ లావాదేవీల ట్రైల్ ఆధారంగా మరిన్ని లింకులు వెలికితీస్తున్నట్లు సమాచారం.
ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో నియంత్రణలు కఠినతరం అవుతున్న వేళ ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. సంబంధిత నకిలీ కంపెనీలు, పేమెంట్ నెట్‌వర్క్‌లపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది. పన్ను ఎగవేత, అక్రమ డిజిటల్ లావాదేవీలపై కఠిన చర్యలు తీసుకుంటామని జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు స్పష్టం చేశారు.
Also Read:AIతో కొత్త ఉద్యోగాల సృష్టి!

