రేవంత్ గాలి తీసిన కోమటిరెడ్డి!

8
- Advertisement -

స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. సర్పంచ్, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఎక్కువ శాతం అధికార పార్టీ అభ్యర్థులకే మద్దతు ఇస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు జరగాలంటే ప్రభుత్వ సహకారం అవసరమని ప్రజలు భావిస్తారని చెప్పారు. అందుకే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా నిధులు, పనులు సులభంగా వస్తాయని ఓటర్లు అనుకుంటారని వివరించారు.

ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల ఫలితాలను ఆధారంగా చేసుకుని గొప్పలు చెప్పుకోవడం సరైంది కాదని పరోక్షంగా సీఎం రేవంత్‌ని ఉద్దేశించి అన్నారు రాజగోపాల్ రెడ్డి. ప్రజలు అభివృద్ధి కోసమే ఓటు వేస్తారని, దాన్ని రాజకీయ లాభంగా చూపించడం తగదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికలతో పోల్చలేమని, వాటి రాజకీయ ప్రభావం వేర్వేరుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Also Read:AIతో కొత్త ఉద్యోగాల సృష్టి!

- Advertisement -