Harish Rao:తెలంగాణ బిల్లు పాసై 12 ఏళ్లు!

14
- Advertisement -

రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజుకు నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు తన ఎక్స్ ఖాతాలో భావోద్వేగ పోస్టు చేశారు. “Bill is Passed” అనే శీర్షికతో ట్వీట్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనకు దారితీసిన సంఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు.

2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించడం చారిత్రాత్మక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. శాంతియుతంగా సాగిన స్వరాష్ట్ర ఉద్యమానికి ఇది ప్రతిఫలమని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని, దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటం, త్యాగం, ఆత్మగౌరవం చివరికి ఫలితాన్నిచ్చాయని హరీశ్ రావు తన పోస్టులో వెల్లడించారు.

కేసీఆర్‌తో కలిసి విజయ సంకేతం చూపుతున్న ఫోటోను కూడా షేర్ చేశారు. తెలంగాణ సాధనలో ప్రతి ఉద్యమకారుడి పాత్రను స్మరించుకుంటూ “జై తెలంగాణ… జై కేసీఆర్” అంటూ ఆయన తన సందేశాన్ని ముగించారు.

Also Read:AIతో కొత్త ఉద్యోగాల సృష్టి!

- Advertisement -