‘భగవద్గీత సాక్షిగా’ తేజ్ కొత్త మూవీ..

219
Sai-Dharam-Tej
- Advertisement -

మామయ్య స్టైల్ ని ఫాలో అవుతూ.. ఆయన పాటలను రిమేక్ చేస్తూ మొదట్లో వరుస విజయాలు అందుకున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్. అయితే ఈ మెగా హీరో సినిమాలు గత కొంతకాలంగా అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి. సుప్రీం తరువాత ఆయన చేసిన ఏ సినిమా బాక్సీఫీస్ వద్ద ప్రభావం చూపలేక పోయాయి. ఎలాగైనా హిట్ కొట్టాలని స్టార్ డైరెక్టర్ వినాయక్ తో ‘ఇంటిలిజెంట్’ మూవీ చేశాడు. అది కాస్తా నిరాశ పరిచింది. తాజగా ‘తేజ్ ఐ లవ్ యూ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి, మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Sai Dharam

వరుస ప్లాఫ్ లతో సతమతవుతోన్న తేజుకి గోపాల్ అనే దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చిందట. కథ కొత్తగా ఉండడంతో కొత్త దర్శకుడైనా.. సాయి వెంటనే తనతో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాకి ‘భగవద్గీత సాక్షిగా ‘అనే టైటిల్ ని కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ‘ఠాగూర్’ మధు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారట.

కొత్త దర్శకుడితో సాయి చేస్తున్న ప్రయత్నం ఈ సారైనా.. ఫలిస్తుందా..? ప్లాఫ్ ట్రాక్ లో వెళ్తున్న తన మూవీలను సక్సెస్ ట్రాక్ లోకి ఈ సినిమాతోనైనా వస్తాడా..? లేదా చూడాలి మరి. మామయ్య సినిమా పాటను తన సినిమాలో రీమేక్ చేయాలనే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న సాయి, ఈ సినిమాలో మరోపాటను రిమేట్ చేస్తాడో లేదో చూడాలి.

- Advertisement -