‘ఆర్ఎక్స్100’ మూవీపై వర్మ ప్రశంసలు..

293
ramgopal varma

అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన, చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తో ముందుకు వెళ్తోంది. తాజాగా తన శిష్యుడిపై ప్రశంసలు కురిపించారు రాంగోపాల్ వర్మ. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారని, అద్భుతమైన సినిమా తీసిన చిత్ర బృందానికి నా అభినందనలు అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సినిమాకి మంచి ఓపెన్నింగ్స్ వచ్చాయని వర్మ పేర్కొన్నాడు. ఈ చిత్ర దర్శకుడు భూపతి గతంలో రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.

rx100

అర్జున్ రెడ్డి తరహాలో కథరాసుకున్న దర్శకుడు భూపతి అదే తరహాలో చూపించే ప్రయత్నం చేశాడని, రిలీజ్ ముందు నుంచే పోస్టర్స్, టీజర్స్ తో ప్రేక్షకులలో ఆసక్తి పెంచేయడంతో.. ఓపెన్నింగ్స్ కూడా బాగానే వచ్చాయని అంటున్నారు. రిలీజ్ కి ముందు చెప్పినట్లుగానే.. బోల్డ్ సన్నివేశాలను చూపించాడని.. ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు. ఫ్యామిలీకి పెద్దగా నచ్చకపోయినా.. యువతను బాగా నచ్చుతుందని టాక్. హీరో, హీరోయిన్ కొత్తవారే అయినప్పటికీ వారి పాత్రలకు న్యాయం చేశారని, రావు రమేష్ మరోసారి అద్బుతంగా నటించారని టాక్ వినిపిస్తోంది.