సాధించగలం అనే తపన ఉంటే చాలు… అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం అని నిరూపిస్తున్నాడు ఓ 70 ఏళ్ల సీతారాం అనే వ్యక్తి. ఊరు మొత్తం నీటి కొరత సమస్యతో ఇబ్బంది పడుతున్నా.. అధికారులు కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకున్న ఓ తాత ఓ అడుగు ముందుకు వేసి ఒక్కడే భావిని తవ్వడం ప్రారంభించాడు.
మధ్యప్రదేశ్లోని ఛతార్పూర్కు సమీపంలోని ఓ గ్రామం గత రెండు సంవత్సరాలుగా నీటి సమ్యతో సతమతమవుతోంది. ఈ సమస్యపై అటు అధికారులు కానీ.. ఇటు ఊరు ప్రజలు కానీ సమస్యకు పరిష్కార మార్గాలు వెతకలేదు. కాని అదే గ్రామానికి చెందిన 70 ఏళ్ల సీతారాం అనే వ్యక్తి మాత్రం తనకు తోచిన ఉపాయంతో బావిని తవ్వుతున్నాడు. ఇప్పటికే సగం బావిని తవ్వేశాడు. ఊరు కోసం ఇంత చేస్తున్నా ఆ తాతకి ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు.
ఈ విషయం తెలుసుకున్న మీడియా.. ఆ తాతని సంప్రదించగా.. ఇప్పటి వరకు సగం బావిని తవ్వానని.. ఇంకా కొంత లోతుకు తవ్వితే నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇక నీళ్లు వస్తే ఊరు కష్టాలు తీరిపోతాయి. అయితే ఒక్కడినే బావిని తవ్వడం కష్టంగా మారింది అంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు.