హ్యాపి బర్త్ డే టు రాధికా ఆప్టే

402
HOT Actress radhika apte
HOT Actress radhika apte
- Advertisement -

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. అని పరిమితులు పెట్టుకోలేదామె. లఘు చిత్రాలు, వెండితెర చిత్రాలు అన్న అవధులూ లేవామెకు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ప్రతిభను నిరూపించుకుంటోంది. చేసే ప్రతి పాత్రకూ న్యాయం చేస్తుంది. తనను కథానాయికగా కాకుండా ఒక నటిగా భావిస్తుంది. ఆమే రాధికా ఆప్టే. ఈమె విమర్శలు పట్టించుకోదు. చేస్తున్న పాత్రకు నూరుపాళ్లు న్యాయం చేయడమే లక్ష్యం. పాత్ర ఏదైనా సరే. వందకు వంద మార్కులు పడాల్సిందే. అందం.. అభినయం. రెండింటినీ మేళవించి అందరినీ ఆకట్టుకోవడమే తెలుసు. ఆమే రాధికా ఆప్టే. ఇవాళ రాధిక పుట్టినరోజు.

HOT Actress radhika apte

రాధికా ఆప్టే సొంతూరు పుణె. కాలేజీ రోజుల నుంచే క్లాసులో కంటే రంగస్థలంపైనే ఎక్కువగా ఉండేవారు. నిజానికి పాఠశాల రోజుల నుంచే ఆమెకు నాటకాలంటే ఇష్టం. అమ్మా నాన్న ఇద్దరూ వైద్యులే అయినా, నాటకాలపైన ఆమెకున్న ఆసక్తికి వారు అడ్డుచెప్పలేదు. స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్.. చిన్న సినిమా.. పెద్ద సినిమా.. ఇలా గిరి గీసుకు కూర్చోలేదు. ఎక్కడ నటనకు అవకాశం ఉంటే అక్కడ అడుగుపెట్టేయడమే ఆమె నైజం. నాటకరంగంతో పాటు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే సినిమాల్లోను బిజీ అయ్యారు. ‘ఫోబియా’, ‘బద్లాపూర్’, ‘మాంఝీ’, ‘హంటర్’ తదితర చిత్రాల్లో మెప్పించిన రాధికా ఆప్టే ఇటీవల ‘కబాలి’ చిత్రంలో రజినీకాంత్ పక్కన మెరిశారు. రాధికా ఆప్టే సొంతూరు పుణె. నాటకరంగమంటే ప్రాణం. అక్కడి నుంచే సినిమాల వైపు అడుగేశారు. కథక్ నేర్చుకున్నారు. మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రావీణ్యం ఉంది.

HOT Actress radhika apte

తెలుగులో రక్తచరిత్ర, ధోని, లెజెండ్, లయన్ సినిమాల్లో నటించారు. సౌత్ లో తెలుగు తర్వాత తమిళం, మలయాళ సినిమాల్లోనూ చేశారు. రాధిక ఒంటరి కాదు. లండన్ కు చెందిన సంగీత కళాకారుడు బెనెడిక్ట్ టేలర్ తో వివాహమైంది. ‘కెమెరా ముందు నిలబడాలి, అది ఏ స్థాయి సినిమా అన్నది ముఖ్యం కాదు’ అంటుంటుంది రాధికా ఆప్టే. ఈ మాట చాలు ఆమెలోని నటీమణి ఏ స్థాయిలో ఉంటుంది అనేది. ఇవాళ రాధికా ఆప్టే పుట్టిన రోజు సందర్భంగా ఆమె మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని మనస్పూర్తిగా జరుపుకోవాలని కోరుకుంటూ ఆమెకు గ్రేట్‌ తెలంగాణ. కామ్‌ తరుపున జన్మదిన శుభాకాంక్షలు.

- Advertisement -