ఆటోలో ‘చిన‌బాబు’..

201
karthi
- Advertisement -

కోలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు కార్తీ న‌టీంచిన చినబాబు సినిమా ఇటివ‌లే విడుద‌లైంది. ఈసినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది. రైతుల స‌మ‌స్య‌ల‌పై ఈచిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈమూవీలో కార్తీ రైతుగా న‌టించాడు. త‌మిళ్ లో పాటు, తెలుగులో కూడా ఈసినిమా ఘ‌న విజ‌యాన్ని సాధించడంతో పాటు బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతుంది. ఇక సినిమా తెలుగు రైట్స్ ను నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి కొనుగోలు చేశారు.

chinababu

ఈచిత్రం విజ‌యం సాధించ‌డంతో చిన‌బాబు చిత్ర‌బృందం తెలుగు రాష్ట్రాలతో పాటు త‌మిళ‌నాడులో కూడా స‌క్సెస్ మీట్ లు నిర్వ‌హిస్తున్నారు. ఇటివ‌లే ఏపీలో పూర్తిచేసుకుని నిన్న‌టి నుంచి హైద‌రాబాద్ లోని ప‌లు థియేట‌ర్ల‌కు వెళ్లి అభిమానుల‌తో క‌లిసి సినిమాను చూస్తున్నారు హీరో కార్తి, నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి. ఈసంద‌ర్భంగా నిన్న హైద‌రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన స‌క్సెస్ మీట్ కు హీరో కార్తీ ఆటోలో వ‌చ్చాడు.

karthi

మాదాపూర్ నుంచి ప్రసాద్ ల్యాబ్ కు వ‌స్తున్న కార్తీ వ‌ర్షం ప‌డ‌టంతో ట్రాఫిక్ జాం అయింది. దీంతో మ‌ధ్య‌లో చిక్కుపోయిన కార్తీ ఏం చేయాలో అర్ధం కాక చాలా సేపు వేచిచూశాడు. అయినా ట్రాఫిక్ క్లియ‌ర్ కాక‌పోవ‌డంతో స‌క్సెస్ మీట్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుంటంతో.. ఏం చేయాలో అర్ధంకాక చివ‌ర‌కు ఆటోలో స‌క్సెస్ మీట్ ఫంక్ష‌న్ కు వెళ్లారు హీరో కార్తీ, నిర్మాత ర‌వీంద‌ర్ రెడ్డి. కార్తీ ఆటోలో ప్రసాద్ ల్యాబ్ కు రావ‌డంతో అభిమానులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు.

- Advertisement -