బాల‌కృష్ణ‌, బోయ‌పాటి మూవీకి ముహుర్తం ఖరారు..

228
balakrishna-boyapati-srinu
- Advertisement -

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్ లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటివ‌లే ఈసినిమాకు సంబంధించిన రెగ్యూల‌ర్ షూటింగ్ ను కూడా ప్రారంభించారు. ఎన్టీఆర్ మొద‌ట‌గా న‌టించిన మ‌న‌దేశం సినిమా సెట్లో షూటింగ్ ను ప్రారంభించారు. ఈసినిమాకు క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా బాల‌కృష్ణ త‌న‌సొంత బ్యాన‌ర్ లో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో బాలీవుడ్ న‌టీ విద్యాబాల‌న్ న‌టిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలో ముఖ్య‌పాత్ర పోషించిన వారి పాత్ర‌లను సినిమాలో చూపించ‌నున్నారు.

ntr biopic

ఇక బాల‌కృష్ణ త‌న త‌రువాతి సినిమా బోయ‌పాటి శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో గ‌తంలో వ‌చ్చిన రెండు సినిమాలు సింహా, లెజెండ్ సినిమాలు ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ముచ్చ‌ట‌గా మూడోసారి వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతుంది. ఈసినిమా షూటింగ్ ను అక్టోబ‌ర్ 10న ప్రారంభించ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు.

balakrishna and boyapati

ప్ర‌స్తుతం బోయ‌పాటి రామ్ చ‌ర‌ణ్ తో ఓసినిమా చేస్తున్నాడు. ఆసినిమా షూటింగ్ అక్టోబ‌ర్ వ‌ర‌కూ పూర్తి చేసుకుని ఆ త‌ర్వాత బాల‌కృష్ణ‌తో సినిమా చేయ‌నున్నాడు. రామ్ చ‌రణ్ న‌టించిన రంగ‌స్ధ‌లం సినిమా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకొవడంతో ఈసినిమాపై కూడా భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు అభిమానులు. బోయ‌పాటి త‌న మాస్ ఎలిమెంట్స్ ఏమేర‌కు విజ‌యం సాధిస్తాడో చూడాలి.

- Advertisement -