ఏ సినిమా అయినా విజయం సాధిస్తే…ఆ సినిమాలోని కొన్ని సీన్స్ ను స్పూఫ్ చేస్తుండడం మామూలే. ఇప్పుడు జనతా గ్యారేజ్ సినిమాలోని కొన్ని సీన్స్ ను స్పూఫ్ చేస్తున్నారు. ఇంతకీ ఏ సినిమాలో కోసం అంటే….అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
మోహన్ లాల్ గెటప్పులో అలీ భజన్ లాల్గా బాగానే ఆకట్టుకుంటాడని సినీ యూనిట్ అంటోంది. ఈ స్పూఫ్ ఎలా ఉంటుందోనని సినీ జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా అల్లరి నరేష్ అంటేనే స్పూఫులకు మారు పేరు. హిట్ సినిమా ట్రాక్లను కామెడీగా వాడుకొని కితకితలు పెడుతుంటాడు. మొన్నటి మొన్న రిలీజ్ అయిన “సెల్ఫీరాజా” వరకూ స్పూఫులపై ఆధారపడినవే. తాజాగా జనతా గ్యారేజ్ను కూడా అల్లరి నరేష్ ”ఇంట్లో దెయ్యం నాకేం భయం” కోసం వాడుకుంటున్నాడు. ఇక జనతా గ్యారేజ్ కాస్త సమంత గ్యారేజ్గా మార్చేసి స్పూఫ్ చేస్తున్నాడు.
ఆలీ భజన్ లాల్ గెటప్ ఎలా ఉంటుందో తెలియచేసేందుకు ఆలీతో సెల్ఫీ తీసుకుని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి. గెటప్ బాగానే ఉంది మరి…తెర పై స్పూఫ్ ఎలా ఉంటుందో చూడాలి..!
సమంతా గ్యారేజ్‌లో ఆలీ
- Advertisement -
- Advertisement -