సుమ అమ్మమ్మకు వంద

228
Suma Kanakala
Suma Kanakala
- Advertisement -

సుమపరిచయం అవసరం లేని పేరు . ఎంతటి స్టార్ హీరో లేదా హీరోయిన్ కైనా ఫలానా సినిమా హీరో అని పరిచయం చేస్తేనే కానీ గుర్తుపట్టనివారుంటారు కానీ.. సుమను, ఆమె గొంతును గుర్తుపట్టని తెలుగువారుండరు. అతిశయోక్తి అనిపించినా ఇది నిజం. టీవీలో వచ్చే షోలు మొదలుకొని ఆడియో ఫంక్షన్ల వరకూ అన్నిటిలోనూ సుమే కనిపిస్తుంటుంది. ఆ వాక్చాతుర్యానికి మహామహులు కూడా గమ్మునుండిపోతారు.
స్టార్ మహిళ, జీన్స్,  సెల్ మీ ది ఆన్సర్   వంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజలకు సుపరిచితురాలు సుమ కనకాల. కేరళకు చెందినప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ ఇంటిల్లిపాదికీ ఫేవరేట్ యాంకర్ గా మారిపోయింది. చక్కటి వ్యాఖ్యానం, చెరగని చిరునవ్వు ఈమె సొంతం. టీవీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా పలు చలనచిత్రాల పాటల ఆవిష్కరణలు, ఇతర సినిమా కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. సమయస్పూర్తితో, మాటల గలగలతో, అందరినీ కలుపుకుపోయే స్నేహభావంతో పలువురి మన్ననలను పొందుతోంది.

 

suma

 

rajeev kanakala

రీసెంట్ గా సుమ తన అమ్మమ్మ పుట్టిన రోజు వేడుకలకు.. కేరళ వెళ్లింది. భర్త రాజీవ్ కనకాలతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొంది. సుమ ఫ్యామిలీ ఈ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా జరపడానికి కారణం.. ఆమెకు ఇది వందో పుట్టిన రోజు కావడమే. కేరళలోనే ఉంటున్న ఆమె పేరు పల్లసన పచ్చువిట్టిల్ సావిత్రిమ్మ. అమ్మమ్మ వందో పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం మరిచిపోలేనని.. ఈ రోజును ఎంతో ఆనందంగా గడుపుతున్నానని సుమ అంటోంది. చిరునవ్వు.. కల్మషం లేని మనసు.. ప్రెజర్ లేని లైఫ్.. అందరూ బాగుండాలని కోరుకోవడం.. ఇదే ఆవిడ నిండు నూరేళ్లు జీవించడానికి కారణం అంటున్న సుమ.. ఆమె అడుగు జాడల్లోనే తాను నడుస్తున్నట్లు చెబుతోంది.

అమ్మమ్మతో గడిపిన కొన్ని క్షణాలను అభిమానులతో కూడా సుమ పంచుకుంది. ఆ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఆమె దోశ వేస్తుంటే.. పక్క నుంచి చూసి ఎంజాయ్ చేయడమే కాదు..’అమ్మమ్మ హండ్రెడ్ ఇయర్స్.. దోశ వేస్తోంది’ అంటూ చెప్పేస్తోంది. అక్కడకెళ్లి కూడా అమ్మమ్మకి యాంకరింగ్ చేసేసింది సుమ. ఈ  వీడియోను తన కూతురు మనస్విని చిత్రీకరించినట్లు తెలిపింది.
సుమ వాళ్ల అమ్మమ్మతో చేయించిన దోశ వీడియో మీకోసం.. చూడండి…

 

- Advertisement -