చిన్నమొక్క భూమిలోనే గుండ్రంగా తిరుగుతుండటం సెన్సేషన్‌గా మారిన సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లాలో లో వెలుగుచూసింది. స్థానిక క్రాంతినగర్‌లోని ఇంటి ఆవరణలో మొలిచిన వేప చెట్టు దానంతట అదే అటూఇటూ తిరగుతోంది. దీనిని మొదట గమనించిన యజమాని గాలికి తిరుగుతుందనుకున్నాడు. కానీ వేపచెట్టు అటూ ఇటూ తిరుగుతుందటంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ సంఘటన బయటకు పొక్కడంతో జనం వచ్చి ఈ వింతను చూసి పూజలు చేయడం మొదలుపెట్టారు.
నేలలో వేర్లతో ఉన్న చెట్లు ఎప్పుడూ కదలవని ఓయూ ప్రొఫెసర్ బి.ఎన్.రెడ్డి పేర్కొన్నారు. మొలకల కింద నీళ్లు ఉంటే ఇది సాధ్యమౌతుందన్నారు. చెట్టు అనేది కదలకుండా ఉండేదని అర్థమని, వింత అనుకోవడం..దేవుడిని ఆపాదించడం..సరికాదన్నారు.
చిన్న మొలకలని, గట్టిపడి ఉండకపోవచ్చని జనవిజ్ఞాన వేదిక పేర్కొంది. మొలకల కింద మట్టి కొద్దిగా లూజ్ కావడం..దాని కింద నీళ్లు చేరి ఉండవచ్చన్నారు. కేవలం మొలకలు కదులుతున్నాయని, గుండ్రంగా తిరడం లేదన్నారు. అక్కడకు వెళ్లి చూస్తే తెలుస్తుందని, ఏదో శక్తికి ఆపాదించడం సరికాదని తెలిపారు.
https://youtu.be/EqklTHDudm0