అక్కినేని కుర్రాళ్ల పెళ్లిళ్లపై కన్ఫ్యూజ్ కొనసాగుతోంది. డిసెంబర్ 9న అఖిల్ ఎంగేజ్ మెంట్ ఫిక్స్ చేస్తూ ప్రకటన చేశాడు నాగార్జున. అయితే.. నాగచైతన్య ఎంగేజ్ మెంట్ పై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. చైతును చేసుకోబోయేది సామ్ అన్న విషయం మాత్రమే రివీల్ చేశాడు. దీంతో ఇప్పుడు చైతుకంటే ముందు అఖిల్ పెళ్లిపీటలు ఎక్కనున్నాడా అనే అనుమానం కలుగుతోంది. ఇప్పటికే నాగ్ ఇద్దరి పెళ్లిళ్లు వేరువేరుగా ఉంటాయని క్లారిటీ ఇచ్చాడుకూడా.
అయితే తాజా విషయమేంటంటే.. చైతు, సామ్ లది మతాంతర వివాహం కాబట్టే ఎంగేజ్ మెంట్ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. సమంత కుటుంబానిది క్రైస్తవమతం.. చైతు హిందువు… దీంతో రెండు మతాల సాంప్రదాయాలకు గౌరవం ఇస్తూ..పెళ్లి జరుపనున్నట్లు తెలుస్తోంది. మొదట చెన్నైలో క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుక జరగనుందట. అదిపూర్తయ్యాక.. హైదరాబాద్‌లో తిరిగి హిందూ పద్ధతిలో పెళ్లి చేస్తారట.
ఇక రెండు మతాల ఆచారాల ప్రకారం రెండు సార్లు జరిగే ఈ వివాహం వచ్చే ఏడాది సమ్మర్ లేదా అంతకు ముందే… జరగొచ్చని తెలుస్తోంది. ఏఎన్నార్ మరణించాక కుటుంబంలో జరుగుతున్న తొలి శుభకార్యం కావడంతో.. పెళ్లిళ్ల కోసం నాగ్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడని సన్నిహితులు చెబుతున్నారు.
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కు కూడా మూడు పెళ్లిళ్లు చేశారు. ఒక సారి చెట్టుతో, ఒక సారి ఆవుతో, మూడో సారి అభిషేక్ షేక్ బచ్చన్ తో పెళ్లి చేశారు. ఇంతకు ఐశ్వర్యరాయ్ కి ఇలా ఎందుకు చేశారంటే ఆమెకు కుజదోషం ఉండడంతో ఇలా చేశారు.