క్లారిటీ లేని నిహారిక..!

498
- Advertisement -

నిహారిక తొలిచిత్రం విడుదలై రోజులు గడుస్తున్న నెక్స్ట్ మూవీపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. రెండు మూడు స్టోరీస్ డస్కర్షన్స్ జరిగినా.. ఏది ఇంకా ఫైనల్ కాలేదు. దీంతో నిహా మళ్లీ వెబ్ సిరీస్ పై దృష్టిపెట్టింది. ఇప్పటికే ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ నిహారికకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ అనే బేనర్ స్థాపించి వెబ్ సిరీస్ ను స్వయంగా నిర్మించింది నిహారిక. అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో వెబ్ సిరీస్ ను నిహారిక పక్కన పెట్టేసింది.

ఇప్పుడు తొలి చిత్రం ఒక మనసు ఘోర పరాజయం కావడం.. ఆ తరువాత చెయాల్సిన మూవీ ఇంకా డిసైడ్ కాకపోవడంతో నిహారిక మళ్లీ వెబ్ సిరీస్ ని స్టార్ట్ చేసింది. మొదటి పెళ్లి చూపులు అనే టైటిల్‌తో ఒక వెబ్ సిరీస్ తీస్తున్నట్లు ఎఫ్ బీలో నిహారిక తెలిపింది. ఆల్‌ ది బెస్ట్‌ అని ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఒక పోస్టర్‌ను కూడా నిహారిక పోస్ట్ చేసింది.దీనికి హరీష్‌ నాగరాజ్‌ అనే యంగ్  డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ వెబ్ సిరీస్ లో నిహారిక నటించడంలేదు. కేవలం ప్రొడక్షన్ పనులు మాత్రమే చూసుకుంటోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించడంతో పాటు రీసెంట్ గా జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ ఫ్రెండ్ పాత్ర పోషించిన రాహుల్ ఇందులో హీరోగా చేస్తున్నాడు.

niharika

నయా అనే కొత్త అమ్మాయి రాహుల్ కి జోడిగా నటిస్తోంది. మొత్తానికి మెగా ఫ్యాన్స్ అంతా నిహారిక సెకండ్ మూవీ గురించి వెయిట్ చేస్తుంటే.. తను మాత్రం ఇలా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. మరీ నిహారిక రెండవ సినిమా ఎప్పుడు ఫైనల్ అవుతుంది. ప్రస్తుతం ఆమె తీరు చూస్తుంటే.. దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. తొలి సినిమా ప్లాప్ తరువాత నిహారిక నటించాలా వద్దా అనే డైలమాలో ఉందట. ఒక వేళ నటన వద్దనుకుంటే నిహారిక నిర్మాతగానే కొనసాగే ఛాన్స్ ఉంది.

- Advertisement -