సమంతకు అరుదైన వ్యాధి

152
- Advertisement -

స్టార్ హీరోయిన్ సమంత తాజా చిత్రం యశోద. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ లో సమంత డైలాగ్ లు అందరిని ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాయి. ట్రైలర్ ఫై పాజీవిట్ రెస్పాన్ వచ్చింది. అయితే ఇంతలోపే సమంత బ్యాడ్ న్యూస్ చెప్పింది. తనకు అరుదైన వ్యాధి వచ్చినట్లు వెల్లడించింది.

గత కొన్ని నెలలగాఆ నేను అనారోగ్యంతో బాధపడుతున్నా. ‘మయోసిటిస్‌’ అనే ఆటో ఇమ్యూనిటీ సమస్యకు చికిత్స తీసుకుంటున్నా. ఈ విషయాన్ని ఎప్పుడో తెలియజేయాలనుకున్నా. కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు నా ఆరోగ్యం స్టేబుల్‌గా ఉంది. త్వరలోనే ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంగా చెప్పారు. జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలో ఉంది. ఐ లవ్‌ యూ’’ అని సమంత ట్వీట్‌ చేశారు.

 

సమంత తన ఆరోగ్య పరిస్థితి వివరించడంతో సెలెబ్రిటీలు, అభిమానులు త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు. ఇప్పటికే శ్రియాశరన్, రాశీఖన్నా, సుష్మిత కొణిదెల స్పీడ్ గా రికవరీ కావాలని ఆకాంక్షించారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ (NTR) కూడా స్పందించారు. ‘సమంత త్వరగా కోలుకోవాలి. అందుకు కావాల్సినంత శక్తిని పొందాలని కోరుకుంటున్నాను’. అంటూ ట్వీటర్ ద్వారా భరోసా వ్యక్తం చేశారు.

 

ఇవి కూడా చదవండి

43మంది ఎమ్మెల్యేలకు బీజేపీ ఆఫర్!

భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కి వర్షం వస్తుందా.?

బీజేపీకి ఓటు మునుగోడుకు చేటు

- Advertisement -