శాంసంగ్ మళ్లీ పేలింది..

457
- Advertisement -

మళ్లీ శాంసంగ్ ఫోన్ పేలడం కలకలం సృష్టించింది.వరుస ఘటనలు, రీకాల్ సంక్షోభానికి తోడు న్యాయపరమైన చర్యల్ని కూడా ఎదుర్కొంటోంది. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడా పామ్ బీచ్ గార్డెన్స్ లో నివసించే జోనాథన్ స్ట్రోబెల్ అనే వినియోగదారుని జేబులోనే గెలాక్సీనోట్ 7 ఫోన్ పేలింది. తొడ భాగంగా తీవ్ర గాయం అయ్యింది. ఊహించని ఘటనతో షాక్ అయ్యాడు స్ట్రోబెల్. వెంటనే కోర్టును ఆశ్రయించాడు.

కోటి రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ పిటిషన్ ఫైల్ చేశాడు. శాంసంగ్ సంస్థ తగిన చర్యలు చేపట్టడంలో విఫలమైందని బాధితుని లాయర్ గట్టిగా వాదించారు. ఈ ప్రమాదంపై కంపెనీ కూడా స్పందించింది. పేలిన ఫోన్ ను కంపెనీకి అప్పగించాలని శాంసంగ్ సంస్థ నుంచి ఈమెయిల్ వచ్చింది. శాంసంగ్ ఫోన్లు.. దక్షిణ కొరియాలో తయారు అవుతాయి. ఇటీవల వరసగా ఈ కంపెనీ లేటెస్ట్ గా విడుదల చేసిన గెలాక్సీ నోట్ 7 ఫోన్లు పేలుతుండటం సంచలనం అయ్యింది. ఈ మొబైల్స్ ఉన్న ప్రయాణికులను విమానాల్లో కూడా అమతించం అని భారత్ ఏవియేషన్ అధికారులు కూడా ప్రకటించారు.

samsung

ప్రపంచ వ్యాప్తంగా గెలాక్సీ నోట్ 7 పేలుడు ప్రమాదాలను ధృవీకరించిన శాంసంగ్ , ఈ ఫోన్లను రీకాల్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. పేలుడు ఘటనలతో వినియోగాదారులను అప్రమత్తం చేస్తూ ఈమెయిల్స్ పంపుతోంది. దీంతోపాటు వినియోగదారులకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.

మరోవైపు గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ఫోన్ లోని బ్యాటరీ పేలుతుందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అమెరికాలో నిషేదం విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ఫోన్ లోని బ్యాటరీ పేలుడుకు సంబంధించి 92 ఘటనలు నమోదయ్యాయి. 26 బ్యాటరీలు కాలిపోయినట్టు ఫిర్యాదులు వచ్చాయి. కారు, గ్యారేజ్ లో మంటలు వచ్చి ఆస్తి నష్టం జరిగినట్టు 55 ఫిర్యాదులు అందాయి.

- Advertisement -