‘వైశాఖం’ సినిమా తృప్తినిచ్చింది…

220
director jaya
- Advertisement -

ఫిలిం ఎనలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ (ఫాస్‌) – అక్కినేని 2017 సినీ, టీవి అవార్డుల ప్రదానోత్సవం, ఫాస్‌ సిల్వర్‌ క్రౌన్‌ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌ త్యాగరాయగాన సభలో చిత్ర ప్రముఖులు, ఆహుతుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి, సమాచార హక్కుల చట్టం మాజీ కమీషనర్‌ విజయబాబు, ప్రముఖ సీనియర్‌ దర్శకులు రేలంగి నరసింహారావు, డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌, ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు, డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి., ప్రముఖ కమెడియన్‌ పృధ్వీ, నటుడు మాణిక్‌, సినీ జర్నలిస్ట్‌ డా. రెంటాల జయదేవ్‌, టి.వి.9 న్యూస్‌ ఎడిటర్‌ చంద్రమౌళి, జెమిని టీవి శ్రీనివాస్‌ తేజ, విజయ్‌, వి6 ప్రతినిధి విజయ్‌ శర్మ, సౌభాగ్య మీడియా ప్రతినిధి కడవాల వెంకటేశ్వర్లు, కలవెండి ఫౌండేషన్‌ కె.ఎస్‌.మూర్తి, వంశీ బర్కిలీ అవార్డుల అధ్యక్షులు వంశీ రామరాజు, సంస్కృతిరత్న ఫాస్‌ అధ్యక్షులు డా.కె. ధర్మారావు పాల్గొన్నారు.

vishakam movie

ఈ కార్యక్రమానికి ముందు ‘అక్కినేని సినీ గాన వైభవం’ ఆధ్వర్యంలో అక్కినేని చిత్రాల్లోని పాటల్ని ఆలపించి వీక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి శ్రీమంత్రి భుజంగరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. జ్యోతి ప్రజ్వలనతో సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు. డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయగారికి ఫాస్‌ సిల్వర్‌ క్రౌన్‌ ఫిలిం అవార్డుతోపాటు శాలువా, కర్పూరదండ ప్రశంసా పత్రాన్ని, బహుకరించారు. అభినందన పురస్కారాన్ని డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌కి కర్పూరదండ, షీల్డ్‌ని అందజేశారు. ప్రత్యేక ప్రశంసా అవార్డుని నటుడు పృధ్వీకి అందించి సన్మానించారు. ఉత్తమ కుటుంబ కథా చిత్రం ‘వైశాఖం’కిగాను నిర్మాత బి.ఎ.రాజుకు శాలువా, షీల్డ్‌తో పాటు సన్మాన పత్రాన్ని అందజేశారు. ఉత్తమ సినీ జర్నలిస్ట్‌ అవార్డును డా. రెంటాల జయదేవ్‌కి బహుకరించారు. ఉత్తమ ఫిలిం అవార్డుల సంస్థకుగాను శిరోమణి డా. వంశీ రామరాజుని సన్మానించి షీల్డ్‌ బహుకరించారు. ఉత్తమ సినీ టీవి, ఈటీవి, ఉత్తమ సీరియల్స్‌ టీవి జెమిని, ఉత్తమ న్యూస్‌ టీవి టీవి-9, ప్రత్యేక ప్రశంసా న్యూస్‌ టీవిగాను 6టీవికి అవార్డులను ప్రదానం చేసి అవార్డు గ్రహీతలను ఘనంగా సత్కరించారు.

saikumar
డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ మాట్లాడుతూ – ”జయగారికి సన్మానం అనగానే ఏమీ ఆలోచించకుండా వచ్చేసాను. చిన్నప్పటి నుండి ఇండస్ట్రీలోనే పుట్టి, ఇండస్ట్రీలోనే సినిమాలను చూస్తూ పెరిగాను. 4 దశాబ్దాల ప్రస్థానం. ఈ జర్నీలో మా నాన్నగారు స్వరం అయితే, సంస్కారం మా అమ్మది. అభిమానం ప్రేక్షకులది. మాది అంతా కళాకారుల కుటుంబం. 1974లో ‘దేవుడు చేసిన పెళ్లి’ చిత్రం నుండి నిన్నటి ‘రాజా ది గ్రేట్‌’ వరకు సినిమాలను చేశాను. 1000 సినిమాలకి పైగా డబ్బింగ్‌ చెప్పాను. ఒక్క కమల్‌హాసన్‌కి తప్ప మిగతా వారందరికీ డబ్బింగ్‌ చెప్పానని అన్నారు.

jaya

డైరెక్టర్‌ జయ బి. మాట్లాడుతూ – ”నాతో పాటు అవార్డులు తీసుకున్న మిత్రులందరికీ శుభాకాంక్షలు. నాకు సిల్వర్‌ క్రౌన్‌ అవార్డు ఎనౌన్స్‌ చేయగానే ఫస్ట్‌ షాక్‌కి గురయ్యాను. ఇంకా నేను సిల్వర్‌ క్రౌన్‌ అవార్డు తీసుకునేంత దూరం రాలేదు అనే ఉద్దేశంలోనే ఉన్నాను. ధర్మారావుగారు ఈ అవార్డు ఇచ్చి నన్ను షాక్‌కి గురి చేశారు. ‘వైశాఖం’ చాలా మంచి సినిమా అని ప్రతి ఒక్కరూ అప్రిషియేట్‌ చేశారు. ‘వైశాఖం’లో మంచి మెసేజ్‌ ఇచ్చాం. అపార్ట్‌మెంట్స్‌లో అందరూ ఉమ్మడి కుటుంబంలా వుండాలి. నలుగురితో కలిసుండాలి అని చెప్పామని అన్నారు.

నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ – ‘విజయ్‌బాబు, నరసింహారెడ్డి వంటి పెద్దవాళ్లు పాల్గొన్న ఈ సభలో పాల్గొనడం చాలా ఆనందంగా వుంది. అవార్డు గ్రహీతలందరికీ నా అభినందనలు. ఇప్పటివరకు నేను 7 చిత్రాలు నిర్మించాను. వాటన్నింటిలో నాకు బాగా నచ్చిన సినిమా ‘వైశాఖం’. సినిమా చూసి ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అని ఎంతో అభినందించారు. ఇంతవరకు ఇలాంటి సబ్జెక్ట్స్‌ రాలేదు. మంచి సినిమా తీశారు అని చాలామంది మెచ్చుకున్నారు. ‘వైశాఖం’ ఉత్తమ చిత్రంగా ‘వైశాఖం’ చిత్రానికి ఫాస్‌ అవార్డుని ఇవ్వడం చాలా సంతోషంగా వుంది. ఎంతో ఇష్టంగా ఈ అవార్డు స్వీకరిస్తున్నాను. ఇదే వేదిక పై మా చిత్రంలో నటించిన సాయికుమార్‌, పృధ్వీ అవార్డులు తీసుకోవడంతో ఇది వైశాఖం ఫంక్షన్‌లా అన్పిస్తోంది. ‘వైశాఖం’లాంటి ఒక మంచి చిత్రాన్ని తీసినందుకు గర్వంగా వుంది. అలాగే జయకి సిల్వర్‌ క్రౌన్‌ ఫిలిం అవార్డు రావడం ఇంకా చాలా హ్యాపీగా వుంది. అందరికీ నా థాంక్స్‌” అన్నారు.

- Advertisement -