రాజకీయాల్లోకి నయన్..!

581
- Advertisement -

ప్రజల్లో తమకున్న ఫాలోయింగ్ దృష్టిలో ఉంచుకుని సినిమావాళ్లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మనదేశంలో సర్వసాధారణ విషయం. అలా ఎంతోమంది అటు సినిమాల్లోనూ.. ఇటు రాజకీయాల్లోనూ నెంబర్ వన్ గా నిలిచిన వారున్నారు. ఇక దక్షిణాదిలో అయితే రాజకీయాలను సినిమాతారలే శాసిస్తున్నారని చెప్పొచ్చు. తమిళ రాజకీయాల్లో అయితే మొత్తం సినీతారలదే హవా.

తాజాగా హాట్ బ్యూటీ నయనతార కూడా తమిళ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తమిళ సినీ వర్గాలు చర్చించుకున్నాయి. రాజకీయాలపై తనకున్న అవగాహానను కూడా రీసెంట్ గా ఓ సందర్భంలో నయనతార ప్రస్తావించిందట. రాజకీయాలపై ఎప్పుటికప్పుడు అప్ డేట్ గా ఉంటుందట నయన్. దీనిబట్టి చూస్తే.. నయన్ రాజకీయ ఆరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది.

Nayanthara

ఆమె సన్నిహితులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు.ఇక రీసెంట్ చెన్నైలో అధికారపార్టీ నిర్వహించిన స్పోర్ట్స్ ఫౌండేషన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నయన్ పాల్గొనడం.. ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తోంది.

ఇటీవల అధికారపార్టీ కార్యక్రమాలకు నయన్ తప్పనిసరిగా హాజరవుతుందని సమాచారం. సినిమా ప్రమోషన్లు డుమ్మాకొట్టే నయన్.. ఆ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.అదే పార్టీలో నయన్ రాజకీయ ఆరంగేట్రం ఉండొచ్చునని తమిళనాట ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

అయితే నయన్ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇంకా చాలా సమయం తీసుకుంటుందని సమాచారం. సినిమాల్లో ఇంకా నయన్ కు అవకాశాలు వస్తుండడంతో ఇప్పట్లో పూర్తిస్ధాయి ఎన్నికలవైపు దృష్టి పెట్టే సూచనలు లేవంటున్నారు.ఈనేపధ్యంలో మళ్లీ వచ్చే ఎన్నికలనాటికి నయనతార పొలిటికల్ ఎంట్రీ ఉంటుందనే టాక్ వినబడుతోంది.

- Advertisement -