యాదాద్రి రూపురేఖలు పూర్తిగా మారుతాయి.. సీఎం కేసీఆర్

701
kcr
- Advertisement -

వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో చైతన్యవంతమైన, స్ఫూర్తివంతమైన తీర్పు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్‌ నేడు భువనగిరి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి త్వరలోనే ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మారనుంది. కాళేశ్వరం నీళ్లుతో యాదాద్రి జిల్లాలో 10 లక్షల ఎకరాల పొలాలు పచ్చగా మారుతాయి. యాదాద్రి రూపురేఖలు పూర్తిగా మారుతాయని అన్నారు.

భువనగిరి ఎంపీ, ఎమ్మెల్యేలు పోరాడి ఎయిమ్స్‌ సాధించారు. మరో 3 నెలల్లో మిషన్‌ భగీరథ పూర్తి చేసి ఇంటింటికీ మంచినీరు అందిస్తాం అన్నారు. ఎన్నికల తర్వాత దండుమల్కాపురం పారిశ్రామిక పార్కుకు శంకుస్థాన చేస్తాం. జనగామకు వైద్య కళాశాల మంజూరు చేస్తాం. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు ఎన్నో రంగాల్లో దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉంది. రైతుబంధు, రైతుబీమా పథకాలను కేంద్రం, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని సీఎం తెలిపారు. విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే తొలిస్థానంలో తెలంగాణ ఉంది ఆయన పేర్కొన్నారు.

ఇక మోదీ, రాహుల్ గెలిస్తే దేశం ఏమైనా మారుతుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే రాహుల్ కు బానిసలుగా, బీజేపీ అభ్యర్థులు గెలిస్తే మోదీకి బానిసలుగా ఉంటారని, అదే, టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్నారు. అందుకే, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కేసీఆర్ కోరారు.

- Advertisement -