అలనాటి అందాల తార సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. మే 9 వ తేదిన విడుదలైన ఈసినిమా బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈసినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఓవర్ సిస్ లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది మహానటి సినిమా. ప్రస్తుతం తెలుగు, తమిళంలో మాత్రమే విడులైన ఈసినిమాను దేవవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే ఈసినిమా బాక్సాఫిస్ వద్ద 30కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగు సినిమా చరిత్రలో తొలి బయోపిక్ గా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాలో సావిత్రి పాత్రలో కిర్తి సురేష్ నటించిన విషయం తెలిసిందే.
కిర్తీ సురేష్ నటనతో మళ్లి సావిత్రి దిగి వచ్చిందనుకుని ఆనందపడిపోయారు ప్రేక్షకులు. సావిత్రి పాత్రకు కిర్తీ సురేష్ వంద శాతం న్యాయం చేసిందని చెప్పుకుంటున్నారు సావిత్రి అభిమానులు. అయితే సావిత్రి జీవిత కథ పెద్దగా ఉండటంతో అన్ని సీన్లు సినిమాలో చూపియడం కుదరక పోవడంతో కొన్ని డిలిట్ చేసిన సీన్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో ఆసీన్లు సినిమాలోనుంచి తీసివేసినట్లు తెలిపారు. సినిమాలో లేని వీడియోలను ప్రస్తుతం యూట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పలు వీడియోలు యూట్యూబ్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియోను విడుదల చేశారు చిత్ర యూనిట్. రావోయి మా ఇంటికి అనే సాంగ్ ఇటివలే విడుదల చేశారు.
కీర్తి సురేష్ అభినయం, అందం అచ్చం సావిత్రిలానే ఉండటంతో ఆమెపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా నుంచి తొలగించిన సీన్లును చూసి ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈసినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా…ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ కుమర్తెలు ప్రియాంక, స్వప్నలు ఈసినిమాను నిర్మించారు. ఈసినిమాకు మిక్కజేమేయర్ సంగీతం అందించారు. త్వరలో దేశవ్యాప్తంగా ఈసినిమా విడుదలైతే మరెన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందో చూడాలి.