బ్రిటన్ రాణి ఎలిజబెత్ సమీప బంధువు (కజిన్) లార్డ్ ఐవర్ మౌంట్ బాటెన్ సంచలన విషయం చెప్పాడు. తాను గే అని ఆయన వెల్లడించాడు. ప్రఖ్యాత బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో ఇలా గే అని చెప్పిన తొలి వ్యక్తి మౌంట్ బాటెనే.
బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీలో గే అని చెప్పిన తొలి వ్యక్తిగా మౌంట్ బాటెన్ నిలిచారు. గతంలో ఆయనకు పెళ్లి కావటం.. ముగ్గురు పిల్లలు ఉండటం గమనార్హం.
లైంగికంగా తాను సమస్యలు ఎదుర్కొన్నానని, ప్రస్తుతం ఓ ఎయిర్ లైన్ క్యాబిన్ సర్వీసెస్ డైరెక్టర్ జేమ్స్ కోయ్లెతో కలసి సంతోషంగా ఉన్నానని చెప్పాడు. ఇప్పుడు నిజమైన జీవితాన్ని గడుపుతున్నాని తెలిపాడు. తనకు పెళ్లికాకముందే తాను గే అనే విషయాన్ని పెన్నీకి చెప్పానని వెల్లడించాడు. తాను ఉభయ సంపర్కుడినని (బై సెక్సువల్) పెన్నీకి చెప్పానని, ఆమె ఈ విషయాన్ని అర్థం చేసుకుందని చెప్పాడు. క్వీన్ విక్టోరియాకు మౌంట్ బాటెన్ ముని ముని మనవడు అవుతాడు.
ప్రస్తుతం భార్యకు విడాకులు ఇచ్చేసిన ఆయన.. ఒక ఎయిర్ లైన్ క్యాబిన్ సర్వీసెస్ డైరెక్టర్ జేమ్స్ కోయ్లెతో కలిసి హ్యాపీగా గడిపేస్తున్న సంచలన విషయాన్ని చెప్పేశారు. తాను పెళ్లికి ముందే గే అన్న విషయాన్ని తన మాజీ భార్యకు తెలుసని చెప్పిన ఆయన.. ఇప్పుడు తాను చాలా హ్యాపీగా బతికేస్తున్నట్లుగా చెప్పారు.
బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో గే….
- Advertisement -
- Advertisement -