బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయం కోసం వారం రోజుల్లో ఆలయ కమిటీలు దరఖాస్తులు అందజేయాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన..బోనాల ఉత్సవాల కోసం ప్రైవేట్ దేవాలయాలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయం అందిస్తుందన్నారు.
ఆషాడ బోనాల ఉత్సవాలకు 15 కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ కేటాయించారన్నారు. బోనాల నిర్వహణ కోసం ప్రతి ఏటా ప్రయివేట్ దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.
Also Read:NBK 108:భగవత్ కేసరి
తెలంగాణ ఏర్పడి న తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. బోనాలకు ముందే ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
జూన్ 22 నుండి ఆషాడ బోనాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 22న గోల్కొండలో ఆషాడ బోనాలు ప్రారంభమవుతాయని ,జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు 10న రంగం నిర్వహించనున్నారు. జులై 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు ఉండనుంది.
Also Read:Nargis Dutt: బర్త్ డే స్పెషల్