బీజేపీపై మంత్రులు గంగుల,ఎర్రబెల్లి ఫైర్

67
- Advertisement -

బీజేపీపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌లో మినీ స్టేడియాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎర్రబెల్లి….పల్లె ప్రగతితో గ్రామాలు బాగుపడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉన్నాయో చూపించాలని డిమాండ్ చేశారు. పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు రావడం లేదని, గ్రామాలకు కేంద్రం నిధులు ఇవ్వకపోతే బండి సంజయ్‌ భరతం పడతామని హెచ్చరించారు.

తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేంద్రంలోని బీజేపీ సర్కార్ విషం చిమ్ముతోందన్నారు మంత్రి గంగుల. తెలంగాణ రాక ముందు వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. సాగునీరు, పంటల పెట్టుబడి, బీమా, కల్తీలేని విత్తనాలు, ఇంటింటికీ నల్లా నీళ్లు, కోతలు లేకుండా 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పారు.

- Advertisement -