ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్. లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. జస్టిస్ సంజీవ్ కన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈ మేరకు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ ఒకటో తేదీ వరకు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. మార్చి 21న లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేజ్రీవాల్.. పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే మాత్రం ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వర్తించొద్దని కొత్త షరతు పెట్టింది.
రాజకీయ నాయకులకు కేసుల్లో మినహాయింపులు ఉండొద్దని.. ఇలాంటి సమయంలో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఈడీ కోర్టుకు విన్నవించింది. అయితే ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కేజ్రీకి మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది.
Also Read:కవిత బెయిల్..24న సమగ్ర విచారణ