సోషల్ మరియు వెబ్ మీడియాలలో యాంకర్ లాస్య వివాహం గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు సినీ హీరో రాజ్ తరుణ్ తో వివాహం జరిగిందని.. రాజ్ తరుణ్ – లాస్యలు కలిసి ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ… వీరిద్దరూ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయం రాజ్ తరుణ్ తనదైన స్టైల్లో స్పందించాడు. అభిమానులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెపుతూనే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసే వారిపై ఫేస్బుక్ పేజ్లో సెటైర్స్ వేశాడు.
‘కేవలం ఒక్కసారి కుమారి 21ఎఫ్ ఆడియో రిలీజ్లో కలిసిన లాస్యతో నా పెళ్లి చేసిన కొంత మంది మీడియా మిత్రులకు, వెబ్ సైట్ దారులకు నా కృతజ్ఞతలు’ అంటూ మొదలు పెట్టిన రాజ్ తరుణ్, ఇలా వెటకారంగా మాట్లాడుతున్నందుకు క్షమించాలని కోరాడు.
ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేసేవారిపై ఇంతకన్నా ఎలా స్పదించాలో తనకు తెలియదన్నాడు. మరో మూడేళ్లలోపు తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, తను పెళ్లి వార్తను తానే అందరికీ తెలియజేస్తానన్నాడు. రూమార్స్ అయినా.., నా గురించి ఆలోచించిన అందరికీ థ్యాంక్స్ అంటూ పంచ్ ఇచ్చాడు.