కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం చింతల్ లోని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్న జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం వెనుక కార్యకర్తల కృషి ఎంతో ఉందని, పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అన్నారు. కార్యకర్తలందరూ సమిష్టిగా క్షేత్రస్థాయిలో పని చేయడంతోనే ఇంతటి విజయం సాధించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఐకమత్యంతో పార్టీ పటిష్టతకు కలిసికట్టుగా అందరం కృషి చేయాలన్నారు.
ఇటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే అటు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అందరినీ కలుపుకుంటూ ఆయా ప్రాంత సమస్యల పరిష్కారం దిశగా కార్యకర్తలు పని చేయాలన్నారు. అలాగే ప్రచార మాధ్యమాల ద్వారా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలపాలన్నారు. పార్టీనీ నమ్ముకున్న కార్యకర్తలకు రాబోయే రోజుల్లో పదవులు తప్పక దక్కుతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కేఎం గౌరీష్, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు, మాజీ కౌన్సిలర్లు సూర్యప్రభ, కిషన్ రావు, నాయకులు సంపత్ మాధవ రెడ్డి, సోమేష్ యాదవ్, కిషోర్ చారి, సత్తిరెడ్డి, సిద్దయ్య, దేవరకొండ శ్రీనివాస్, జాకీర్, రమేష్, నజీర్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.