కింగ్ నాగార్జున సమర్పణలో మైటీస్టార్ శ్రీకాంత్ తనయుడు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తూ జి. నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్, కాన్సెప్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బేనర్స్ పై అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘నిర్మలా కాన్వెంట్’. శ్రియా శర్మ హీరోయిన్‌గా నటించింది. రోషన్ సాలూరి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోకి శ్రోతల నుండి టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా కింగ్ నాగార్జున పాడిన ‘కొత్త కొత్త భాష’ పాట మ్యూజిక్ లవర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటూ పెద్ద హిట్ అయ్యింది. అలాగే ఈ చిత్రం ద్వారా 9 మంది న్యూ టాలెంట్స్‌ని పరిచయం చేస్తున్నారు.
అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా సెప్టెంబర్ 16న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్-ఊహ రోషన్‌లు ‘నిర్మల కాన్వెంట్’ చిత్ర విశేషాల గురించి అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మట్లాడుతూ శ్రీకాంత్ మాట్లాడుతూ – ”ముందుగా నాగార్జునగారికి, నిమ్మగడ్డ ప్రసాద్‌గారికి, జి.కె.గారికి థాంక్స్ చెప్పుకోవాలి. అనుకోకుండా ‘నిర్మలా కాన్వెంట్’ ఆఫర్ వచ్చింది. అస్సలు మేం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అప్పుడే రోషన్‌ని హీరోగా చేయకూడదు అనుకున్నాం. కానీ సబ్జెక్ట్ చాలా బాగుంది. అలాగే నాగార్జునగారు, నిమ్మగడ్డ ప్రసాద్‌గారు నిర్మాతలవడం ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్. ఈ సినిమా రోషన్ చేసాడు అనేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే సినిమాకి ఏం కావాలి? ఎలా చెయ్యాలి. అందరితో ఎలా మెలగాలి అనేది ఒక ఎక్స్‌పీరియన్స్‌లా ఉపయోగపడుతుంది. ఆరోజు నేను రాంగ్ నిర్ణయం తీసుకుంటే కనుక ‘నిర్మలా కాన్వెంట్’లో రోషన్ వుండేవాడు కాదు. ఆ దేవుడు మంచి నిర్ణయం కల్పించి ఈ చిత్రంలో రోషన్ నటించే అవకాశం కల్పించాడు. చాలా సంతోషంగా వుంది. రోషన్ ఎలా చేస్తున్నాడు? ఏంటి? అని షూటింగ్ స్పాట్‌కి నేను రెండుసార్లు మాత్రమే వెళ్లాను.
ఎక్కడా టెన్షన్ పడకుండా చాలా కూల్‌గా కాన్ఫిడెన్స్‌గా చేస్తున్నాడు. ఇక ఆ తర్వాత షూటింగ్‌కి వెళ్లలేదు. ఏది చేసినా నువ్వే చేస్కో. నువ్వే డెసిషన్ తీసుకో అని రోషన్‌కే వదిలేసాం. ఇది అలవాటైతే నీ కాళ్ల మీద నువ్వే నిలబడగలవు అని చెప్పాం. సినిమా పూర్తిగా చూడలేదు. కానీ చూసినవారంతా చాలా బాగుంది అని చెప్పారు. రేపు ఫస్ట్‌కాపీ రెడీ అయ్యాక మేమంతా చూస్తాం. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా ఎగ్జయిటింగ్‌గా వుంది. రోషన్‌కి చాలా మంచి పేరు వస్తుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం. ప్రేక్షకులు, అభిమానులు అందరి బ్లెస్సింగ్స్ రోషన్‌కి వుండాలి. రోషన్‌కి ఒక్కటే చెప్పదలుచుకున్నాం. మేమంతా ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఈ స్టేజ్‌కి వచ్చాం. నీకు బ్యాక్‌గ్రౌండ్ వుంది. దానిని నిలబెట్టుకుంట ఎంతో హార్డ్ వర్క్ చెయ్యాలి. అందరితో మంచి, మర్యాదలతో మెలగాలి. డౌన్ టు ఎర్త్ పర్సన్‌లా వుండాలి అని చెప్పాను. అలాగే వుంటాడు. ఆల్ ది బెస్ట్ రోషన్” అన్నారు.
రోషన్‌ని హీరోగా చెయ్యాలనే ఆలోచన ఎవరిది?
– నేను ఫస్ట్ రోషన్‌ని క్రికెటర్‌ని చేద్దాం అనుకున్నా. ఐదేళ్ల వయస్సున్నప్పుడు కోచింగ్ ఇప్పించాం. ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్‌కి తీసుకెళ్ళి.. తీసుకొచ్చేవాళ్ళం. ఎంతో సపోర్ట్ చేసి కష్టపడ్డాం. అయినా మాకే కొంచెం కష్టం అన్పించింది. స్టేట్‌కి కూడా సెలెక్ట్ అయ్యే టైమ్‌లో ‘రుద్రమదేవి’లో ఆఫర్ వచ్చింది. చిన్నప్పటి ‘రుద్రమదేవి’గా నటించాడు. అప్పట్నుంచీ రోషన్‌కి సినిమాలపై ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. నెక్ట్స్ హీరోగా చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. మాకైతే అన్నీ ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా నేర్పించి ఇరవై ఏళ్లకు హీరోగా గ్రాండ్‌గా లాంచ్ చేద్దాం అనుకున్నాం. అనుకోకుండా ‘నిర్మలా కాన్వెంట్’లో ఛాన్స్ రావడంతో ఏమీ ఆలోచించకుండా ఈ సినిమా చేయడం జరిగింది.
నాగార్జునగారితో మీరు విలన్‌గా నటించారు? ఇప్పుడు మీ అబ్బాయి ఆయన నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్’లో నటించారు. ఎలా ఫీలవుతున్నారు?
– అప్పట్లో నాకు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు కాబట్టి వచ్చిన అవకాశాన్ని కాదనకుండా ఏక్ట్ చేశాను. ఇప్పుడు లక్కీగా రోషన్‌కి అవకాశం లభించింది. రోషన్ నాగార్జునగారితో కలిసి నటించడం చాలా హ్యాపీగా వుంది. ఇలా చెయ్యాలి. అలా చెయ్యాలి అని ఎన్నో టిప్స్ చెప్పి నాగార్జునగారు ఎంకరేజ్ చేశారు. అలాగే ఫస్ట్ ఫిలిం అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లో చేయడం రోషన్ అదృష్టం. అలాగే నిమ్మగడ్డ ప్రసాద్‌గారు కూడా ఎంతో సపోర్ట్ చేశారు. నాగార్జునగారితో నేను విలన్‌గా నటిస్తే.. మా అబ్బాయి హీరోగా నటించడం చాలా హ్యాపీగా వుంది.
సినిమా చూసి ఎలా ఫీలయ్యారు?
– సినిమా అంతా చూడలేదు. కొన్ని బిట్స్‌గా చూశాం. రేపు చూస్తాను. డెఫినెట్‌గా సినిమా మంచి హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం. సెంటిమెంట్, లవ్ సీన్స్, ఎంటర్‌టైనింగ్ సీన్స్‌ని ఎక్స్‌ట్రార్డినరీగా చేసాడు.
ఆడియో ఫంక్షన్‌లో స్టేజిమీద రోషన్ మాట్లాడినప్పుడు మీకెలా అన్పించింది?
– మైకు పట్టుకుని మాట్లాడటం అనేది ఓ జాబ్. వచ్చిన కొత్తలో నాకు చాలా భయం వేసేది. అస్సలు మాట్లాడేవాడిని కాదు. ఈ విషయం అందరికీ తెల్సు. రోషన్ మా గురించి అలా మాట్లాడతాడని మేం అస్సలు ఊహించలేదు. ఇంట్లో వాడు చాలా తక్కువ మాట్లాడతాడు. అలాంటిది ఒక్కసారిగా మా గురించి మాట్లాడినప్పుడు కొంచెం ఎమోషనల్‌గా ఫీలయ్యాను. కళ్ల వెంట నీళ్లు వచ్చాయి.
రోషన్ కెరీర్‌ని ఎలా ప్లాన్ చేస్తున్నారు?
– ‘నిర్మలా కాన్వెంట్’తో రోషన్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. టు ఇయర్స్ గ్యాప్ తీసుకుని ఆ తర్వాత నెక్స్‌ట్ ఫిల్మ్ గురించి ఆలోచిస్తాం. ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా కష్టపడి ఎంతో నేర్చుకోవాలి. ఎంత హార్డ్‌వర్క్ చేస్తే అంత సక్సెస్ వస్తుంది. ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా అన్నీ పర్‌ఫెక్ట్‌గా నేర్చుకుని తన ఏజ్‌కి సూట్ అయ్యే క్యారెక్టర్స్‌లో సినిమాలు చేస్తాడు.
డ్యాన్స్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు?
– తప్పకుండా. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అంతా డ్యాన్స్‌లు బాగా చేస్తున్నారు. ఈ కాంపిటీషన్‌లో నెగ్గుకురావాలంటే డ్యాన్స్‌లు కంపల్సరీగా బాగా చెయ్యాలి. చిన్నప్పటి నుండి రోషన్ డ్యాన్స్‌లు చేసేవాడు. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తాడు. తనకంటూ ఓ సెపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకోవాలి. ప్రతి క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్ అయి చెయ్యాలి. అన్నింటికంటే ముఖ్యంగా లక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫిజికల్‌గా కూడా రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నాడు. బాడీ ఫిట్‌గా వుంటే ఆరోగ్యంగా వుంటాం. అప్పుడే మంచి సినిమాలు చెయ్యగలుగుతాం.. అన్నారు.
రోషన్ అదృష్టం – శ్రీమతి ఊహ
‘నిర్మలా కాన్వెంట్’లో రోషన్‌కి అవకాశం వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి?
– ఫస్ట్ అస్సలు ఊహించలేదు. ‘రుద్రమదేవి’ చేసాక స్టాప్ చేద్దాం అనుకున్నాం. కానీ ‘నిర్మలా కాన్వెంట్’ సబ్జెక్ట్ విన్నాక కాదనలేకపోయాం. రోషన్‌కి ఇంట్రెస్ట్ వుంటే చేద్దాం అని ఫిక్స్ అయ్యాం. రోషన్ కూడా సినిమా చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించాడు. తన ఏజ్‌కి సెట్ అయ్యే ఫ్రెష్ అండ్ ప్యూర్ టీనేజ్ లవ్‌స్టోరి ఇది. నాగార్జునగారు, నిమ్మగడ్డ ప్రసాద్‌గారు కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేసి ఈ సినిమా తీశారు. ఫస్ట్ ఫిలిం నాగార్జునగారు, నిమ్మగడ్డ ప్రసాద్‌గారి బేనర్‌లో రావడం అదృష్టంగా భావించి ఈ సినిమా ఒప్పుకున్నాం. రోషన్ ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది.
మీరేమైనా రోషన్‌కి సజెషన్స్ ఇచ్చారా?
– మా ఎక్స్‌పీరియన్స్‌తో ఇంట్లో వున్నప్పుడు సీనియర్ ఏక్ట్రెస్‌గా కొన్ని కొన్ని టిప్స్ చెప్పేవాళ్ళం. సెట్స్‌కి ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ ఇంటికి వచ్చాక రోషన్ ఎక్స్‌పీరియన్స్ మాతో షేర్ చేసుకునేవాడు. జి.కె.గారు ఎప్పటికప్పుడు రోషన్ ఎలా చేస్తున్నాడనేది మాకు కాల్ చేసి చెప్పేవారు. నాగార్జునగారితో నటించేటప్పుడు మాత్రం కొంచెం టెన్షన్ పడ్డాడు. ఈ విషయంలో నాగార్జునగారు ఎంతో సపోర్ట్ చేశారు. సెకండ్ డే నుండి ఎలాంటి టెన్షన్ లేకుండా చేసాడు అని చెప్పారు.
స్టడీస్‌కి ఎలాంటి ప్రాబ్లెమ్స్ రాలేదా?
– కొంచెం ఇబ్బంది వుంది కానీ జి.కె.గారు పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో షూటింగ్ చేశారు. స్కూల్‌వారు కూడా ఫ్లెక్సిబుల్‌గా బాగా ఎంకరేజ్ చేశారు.
ఆడియోలో రోషన్ మాట్లాడినప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు?
– ఫస్ట్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హీరో వైఫ్‌గా, ఒక ఏక్ట్రెస్‌గా ప్రక్కన పెడితే మనబ్బాయి స్క్రీన్‌మీద కన్పిస్తుంటే ఒక మదర్ అనే ఫీలింగ్ కల్గింది. కష్టపడకుండా లక్కీగా ఈ సినిమాలో రోషన్‌కి ఆఫర్ రావడం చాలా హ్యాపీగా వుంది. ఇంట్లో ఎక్కువ మాట్లాడడు. రోషన్ అలా మాట్లాడతాడని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా గురించి రోషన్ మనసులో ఒక మంచి అభిప్రాయం వుంది అని తన మాటల్లో తెల్సింది. అది విన్నాక కొంచెం ఎమోషనల్‌గా ఫీలయ్యాను.
నన్ను ఒక నార్మల్ కిడ్‌లా పెంచారు – రోషన్
మీ మదర్ అండ్ ఫాదర్ ఎలాంటి సలహాలు ఇచ్చారు?
– కొంచెం కష్టమైన సీన్స్ వున్నప్పుడు అమ్మా-నాన్న కొన్ని టిప్స్ చెప్పారు. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్‌లో సిట్చ్యుయేషన్ బట్టి సీన్స్‌లో ఇన్‌వాల్వ్ అయి ఫీలై నటించాలి. ఒరిజినల్ టైప్‌లో మనం ఎలా వుంటామో అలాగే ఫీలై చెయ్యి అని చెప్పారు.
హీరో అయ్యారు కదా? మీ ఫ్రెండ్స్ రియాక్షన్ ఎలా వుంది?
– సక్సెస్‌లో వున్నప్పుడు పొజిషన్ మారినప్పుడు డెఫినెట్‌గా తన చుట్టూ వున్నవారు మారతారు. కానీ నా ఫ్రెండ్స్ అంతా ఇప్పటికీ ఏరా? పోరా? అని పిలుస్తున్నారు. నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. హీరోలా కాకుండా ఫ్రెండ్‌లానే చూస్తున్నారు.
ఫస్ట్ టైమ్ హీరోగా చేస్తున్నారు? ఎలా ఫీలయ్యారు?
– ఫస్ట్‌టైమ్ నేను కెమెరా ఫేస్ చేసింది ‘రుద్రమదేవి’లో. ఒక హీరోగా చేసేటప్పుడు, క్యారెక్టర్ ఏక్టర్‌గా చేసేటప్పుడు చాలా డిఫరెన్స్ వుంటుంది. హీరోగా చేసేటప్పుడు కొంచెం టెన్షన్ ఎక్కువ. క్యారెక్టర్ ఏక్టర్‌గా చేసేటప్పుడు అటెన్షన్ ఎక్కువ. ఈ ఫిలిం చేసేటప్పుడు ఫస్ట్ నెర్వస్‌గా ఫీలయ్యాను.
క్రికెటర్‌గా కాకుండా హీరోగా లాంచ్ అవుతున్నారు?
– క్రికెట్ కోచింగ్ తీసుకుని స్టేట్‌కి సెలెక్ట్ అయ్యే టైమ్‌లో ‘రుద్రమదేవి’లో ఆఫర్ వచ్చింది. తర్వాత సినిమాల్లో ఏక్ట్ చేస్తే టీవిల్లో కూడా కన్పిస్తాం అని ఫీలయ్యేవాణ్ణి. వన్ ఇయర్ తర్వాత ఈ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలా మెల్లగా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ పోయి మూవీస్ పై ఇంట్రెస్ట్ పెరిగింది.
మీ నాన్నగారితో కలిసి నటిస్తారా?
– ఫ్యూచర్‌లో డెఫినెట్‌గా చేస్తాను. చిన్నప్పటి నుండి ఒక ఏక్టర్ కొడుకులా పెంచలేదు. ఒక నార్మల్ కిడ్‌లానే పెంచారు. షూటింగ్స్‌కి కూడా ఎప్పుడూ వెళ్లేవాణ్ణి కాదు. ఒక మనిషి మంచి పొజిషన్‌కి రావాలంటే కష్టం అంటే ఏంటో తెలియాలి. అందుకే నన్ను నార్మల్ కిడ్‌లా పెంచారు.