గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో కిరాతకాలు.. ఘరానా హత్యలే కాదు.. అత్యంత పాశవికంగా అత్యాచారాలు చేశాడన్న వాస్తవాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. నయీం మాట వినక పోతే పచ్చిమిర్చి రసం తాగించి అత్యాచారం చేసేవాడని బాధిత బాలికలు పోలీసులకు ఇచ్చిన వాంగ్ములంలో పేర్కొన్నారు. నయీం తమపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆ తర్వాత ఏవో మందులు ఇచ్చేవాడని బాలికలు తెలిపారు.
ఈ అకృత్యాలను నయీం బంధువులు సుల్తానా, తాహెరా, ఫహీం, హసీనా, సలీమా, తానియానే దగ్గరుండి నిర్వహించేవారన్నారు. రెండు రోజులకోసారి నయీం గదిలోకి వెళ్లాల్సిందిగా నయీం బంధువులు తమను బలవంతం చేసేవారని బాలికలు వాంగ్ములంలో వెల్లడించారు. నయీం అత్త సుల్తానా తనకు పెళ్లి చేస్తానని చెప్పి ఆరేళ్ల క్రితం ఇక్కడికి తీసుకొచ్చినట్లు ఓ బాధిత బాలిక తెలిపింది. అంతేకాక నయీంకు ఎదురు మాట్లాడిన ఓ బాలికను నయీం హతమార్చాడని వారు వాంగ్మూలంలో తెలిపారు.
ఇక నయీం కేసుకు సంబంధించి అన్ని వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీకి నయీంతో సంబంధాలున్నట్లు దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. నయీమ్‌తో ఆయన మాట్లాడిన వాయిస్ రికార్డులు కూడా దర్యాప్తు అధికారుల వద్ద ఉన్నట్లు సమాచారం.