ఒక్క జియో సిమ్‌కి 8 మంది…

248
reliance
reliance
- Advertisement -

రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) అనుబంధ సంస్థ రిలయన్స్ జియో 4జీ సేవలు సోమవారం నుంచి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వాయిస్ కాలింగ్‌ను పూర్తిగా ఉచితంగా అందించడంతోపాటు అత్యంత చౌక రేట్లకు డేటా ప్లాన్‌లను ప్రకటించడంతో జియో సిమ్ కార్డుల కోసం వినియోగదారులు పోటీ పడుతున్నారు. ప్రివ్యూ సేవల్లో భాగంగా డిసెంబర్ 31 వరకూ జియో వాయిస్, డేటా, యాప్స్ ఇతరత్రా సేవలన్నీ పూర్తిగా ఉచితంగా పొందొచ్చు.

ఇక రిలయన్స్ స్టోర్లలో వచ్చిన సిమ్‌లు వచ్చినవి వచ్చినట్టుగా అమ్ముడవుతున్నాయి. కస్టమర్లకు సిమ్‌లను ఇవ్వలేక రిలయన్స్ సిబ్బంది వారం నుండి  నెల వరకు టోకెన్లు జారీ చేస్తున్నారు. సిమ్‌ కోసం మళ్లీ మళ్లీ రావాలా అని కస్టమర్లు వాపోతున్నారు. అయినా తప్పదన్నట్లు ఎన్ని వారాలైనా.. నెలలైనా.. జియో సిమ్ తీసుకోవాల్సిందేనని టోకెన్ తీసుకొని వెళ్లిపోతున్నారు.

ఇక జియో సిమ్‌ యాక్టివేషన్‌ కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబై, ఢిల్లీ నగరాల్లో ఈ కేవైసీ ప్రాసెస్‌తో త్వరగానే సిమ్‌లు యాక్టి వేట్ అవుతున్నాయి. హైదరాబాద్‌, నోయిడా లాంటి నగరాల్లో రోజురోజుకు అప్లికేషన్లు పెరిగిపోతున్నాయి. అప్లికేషన్‌లో ఏ చిన్న పొరపాటు చేసినా సిమ్ యాక్టివేట్ కావడం లేదు. సిమ్‌లు దొరక్క కొందరు.. దొరికినా యాక్టివేషన్‌ కాకపోవడంతో ఇంకొందరు నానా పాట్లు పడుతున్నారు. నోయిడా లాంటి పట్టణాల్లో రిలయన్స్‌ స్టోర్ల ముందు ఉదయం 5 గంటల నుండే క్యూ లైన్లు దర్శనం ఇస్తున్నాయి.

Reliance-Jio-4G-SIM-Card

ఇక ఈ నెల 9 వరకు 4600 మంది జియో సిమ్‌ల కోసం రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని నోయిడాలోని ఓ రిలయన్స్ స్టోర్ అధికారి వెల్లడించారు. రోజు ఆ సంఖ్య మరింత పెరిగిపోతుందన్నారు. సోమవారం నుండి రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారికి జియో సిమ్‌లు ఇవ్వాల్సి ఉంది. అయితే రిలయన్స్ స్టోర్లలో రోజుకు కేవలం 150 సిమ్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. మరి ఈ లెక్కన ఒక్క జియో సిమ్‌ కోసం 8 మంది పోటీ పడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే డిసెంబర్‌ వరకు ఎంతమందికి జియో సిమ్‌లు దొరుకుతాయి.. ఈ కేవైసీ ప్రాసెస్‌తో సిమ్‌లను త్వరగా యాక్టివేషన్ చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే సిమ్‌లను ఇచ్చే సంఖ్యను కూడా పెంచాలని వారు సూచిస్తున్నారు.

reliance-store_

ఇక ఏ క్షణమైనా జియో సిమ్‌ తీసుకునే అవకాశం మీకు రావచ్చు. అందుకోసం తగిన ప్రూఫ్‌లు మీ వెంట పెట్టుకోండి..
అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ తీసుకెళ్లాలి
ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ పట్టుకెళ్లాలి
ఒకవేళ ఆధార్ కార్డు తీసుకున్న రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో దరఖాస్తు చేస్తే యాక్టివేషన్ కు ఎక్కువ సమయం పడుతుంది
రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు తప్పనిసరి
మై జియో యాప్ నుంచి ఆఫర్ కోడ్ ను తీసుకెళ్లడం మర్చిపోవద్దు
జియో పోస్ట్ పెయిడ్ సిమ్ కావాలంటే ప్రస్తుతం వాడుతున్న మొబైల్ బిల్లు సమర్పించాలి
అయితే పోస్ట్ పెయిడ్ బిల్లు మూడు నెలలలోపుది అయ్యుండాలి. బిల్లుపై వినియోగదారుడి అడ్రస్ స్పష్టంగా కనబడేట్టు ఉండాలి

- Advertisement -