నమ్రత మహేష్‌ గురించి మీకు తెలియని ..

564
namrata mahesh
- Advertisement -

నమ్రత శిరోద్కర్….మాజీ మిస్ ఇండియా, ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి. ఈ పరిచయం తెలుగువారికి కొంచెం కొత్తగా అనిపించొచ్చు. ప్రిన్స్ మహేష్ బాబు భార్యగా నమ్రతా తెలుగువారందరకి సుపరిచితురాలు.నమ్రత మహారాష్ట్రలో పుట్టి పెరిగింది. అయితే ఆమె పూర్వీకులు మూలాలు గోవాలో ఉన్నాయి. నమ్రత అమ్మమ్మ ప్రముఖ మరాఠీ నటి మీనాక్షి శిరోద్కర్. ఆ వారసత్వం వలనే కావచ్చు నమ్రత సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చింది. నమ్రత అక్కయ్య శిల్ప శిరోద్కర్ కూడా నటే. ఇప్పటికీ ఆమె నటిగా రాణిస్తోంది.

ఇంట్లో సినిమా వాతావరణం ఉన్నప్పటికీ, నమ్రత మాత్రం యంగ్ ఏజ్ లో మోడలింగ్ పై ముక్కువ చూపించింది. అలా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన నమ్రత 1993లో మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది. ఆ తరువాత ఇండియా తరుపున మిస్ యూనివర్శ్ పోటీల్లో పాల్గొన్నా.. విశ్వ సుందరి కిరీటం మాత్రం దక్కించుకోలేక పోయింది. మిస్ యూనివర్స్ లో ఐదవ స్థానంతో సరిపెట్టుకున్న నమ్రత, అదే ఏడాది జరిగిన మిస్ ఏసియా పసిఫిక్ పోటీల్లోనూ పాల్గొని ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. మిస్ ఇండియా అయిన తరువాతే నమ్రతను బాలీవుడ్ అవకాశాలు వెతక్కుంటూ వచ్చాయి. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి నటించిన ‘పురబ్ కి లాలియా పశ్చిమ్ కి చాలియా’ నమ్రత తొలిమూవీ. అయితే ఈ సినిమా రిలీజ్ కు నోచుకోలేదు.

mahesh-babu-wedding-day

ఆ తరువాత 1998లో ‘జబ్ ప్యార్ కిసీసే హోతాహై’ సినిమా ద్వారా నమ్రత సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ తరువాత వచ్చిన వాస్తవ్ మూవీ నమ్రత్ కెరీర్లో తొలి హిట్ సినిమా. దీని తర్వాత నమ్రతకు అవకాశాలు క్యూ కట్టాయి. అలా దాదాపు 20కి పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. సౌత్ లో నమ్రత చేసిన సినిమాలు తక్కువే. తెలుగులో రెండు, కన్నడ, మళయాలంలో ఒక్కో సినిమా మాత్రమే చేసింది.

2004లో నమ్రత తెలుగులో తొలిసారి ఓ సినిమాకు సైన్ చేసింది. అదే మహేష్ బాబు హీరోగా వచ్చిన వంశీ చిత్రం.ఈ సినిమా షూటింగ్ టైంలోనే మహేష్ తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా ఇద్దరు కలిసి నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. చివరికి నమ్రత ఫ్యామిలీ పెళ్లికి అంగీకరించినప్పటికీ, మహేష్ ప్యామిలీ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ఇంట్లో తెలియకుండా మహేష్ బాబు, నమ్రతను ఫిబ్రవరి 10 2005లో ముంబాయ్ లో పెళ్లి చేసుకున్నాడు.

maheshbabu-namrata-wedding5

పెళ్లికి ముందు నమ్రత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా 2004 వచ్చిన ‘అంజి’ చిత్రంలో నటించింది. మహేష్ తో వివాహం జరుగడంతో ఆ తరువాత సినిమాలు పూర్తిగా మానేసింది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే… నమ్రత వయసులో మహేష్ బాబు కంటే పెద్దది. నమ్రత మార్చి 1, 1972లో జన్మించింది. మహేష్ బాబు ఆగస్టు 9, 1975లో జన్మించారు. అంటే ఇద్దరి మధ్య మూడేళ్లకుపైగా వయసు తేడా ఉంది.

పెళ్లి తరువాత మహేష్ కుటుంబసభ్యులు నమ్రతతో పూర్తిగా కలిసిపోయారు. అప్పటి నుంచి ఈ జంట ఎంతో అనోన్యంగా జీవిస్తోంది. నమ్రత, మహేష్ బాబుకు గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు. గౌతమ్ 2006లో, సితార 2012 లో పుట్టింది. మహేష్ లా గౌతమ్ కూడా బాలనటుడిగా వన్ నేనొక్కడినే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. భవిష్యత్ లో గౌతమ్ కూడా హీరోగా చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అటు ఇంటి బాధ్యతలతో పాటు మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన పనులు, తమ సొంత ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటూ ఇల్లాలిగా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు నమ్రత.

- Advertisement -