శ్రుతి మించుతున్న సుమ..

648
Suma
Suma
- Advertisement -

ఫీమేల్ యాంకర్లలో స్టార్ మహిళా.. సుమ కనకాల. కేరళా అమ్మాయి అయినా.. తెలుగువాళ్లందరికి బుల్లితెర నటిగా.. వ్యాఖ్యాతగా ఆమె ఏనాడో సుపరిచితురాలు. తెలుగులో టాప్ యాంకర్ సుమ. ఏడాదిలో ఆమె తీసుకునేరెమ్యూరేషన్ కాస్త అటుఇటుగా.. ఓ స్టార్ హీరోయిన్ రెమ్యూరేషన్ తో సమానం. అంతలా వెనకేసుకుంటోంది ఈ యాంకర్. పద్దతిగా నిండైనా చిరకట్టుతో కనిపించడంలో సుమది ప్రత్యేక శైలి. అసభ్యతకు ఎంతో దూరం. అయితే ఇటీవల సుమ కూడా రూట్ మార్చింది.

తెలుగు బుల్లితెరపై అసభ్య సన్నివేశాలు, పదజాలాలు ఎక్కువైపోతున్నాయి. నటీనటులను పక్కనపెడితే.. ఈ విషయంలో ఫీమేల్ యాంకర్లు మరీ శ్రతిమించుతున్నారు. యువత ఎక్కవగా ప్రొగ్రామ్స్ ని ఇష్టపడుతుండడంతో ఛానల్స్ రేటింగ్ కోసం ఇలాంటి వాటగని ప్రొత్సహిస్తున్నాయి. వ్యూయర్స్ ని ఆకట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. అర్థనగ్న ప్రదర్శనలు చేసేవారు కొందరైతే.. సాంప్రదాయంగా కనిపిస్తూనే.. తమ మాటలు, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకునే వారు మరికొందరు. అయితే అవకాశాల కోసం కొందరు యాంకర్లు మరీ బరి తెగిస్తున్నారు. ఎక్స్ పోజింగ్ తో బుల్లితెరపైనే A సర్టిఫికేట్ సినిమాల్ని చూపిస్తున్నారు.

sumaa

సినిమా అయితే.. కనీసం పిల్లల్ని దూరంగా పెడతాం. కానీ, బుల్లితెరపైనే A కంటెంట్ ప్రోగ్రామ్స్ వీరవిహారం చేస్తున్నాయి. అయినాపట్టించుకునేవారే లేరు. సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్లు ఇస్తూ.. ఛానల్స్ ను ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కావడంలేదు. తెలుగులో యాంకర్ సుమ అంటే మంచి పేరుంది. ఆవిడ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పుట్టింది కేరళలో అయినా.. అచ్చ తెలుగు అమ్మాయిల ఉంటుంది తన శైలి.తెలుగులో కాస్త అటు ఇటుగా తెలుగు ఛానళ్ల ప్రారంభం నుంచి సుమ బుల్లితెర ఆర్టిస్టుగా.. యాంకర్ గా ఈ ఫీల్డ్ లో ఉంది. ప్రస్తుతం తెలుగులో ఉన్న ఫీమేల్ యాంకర్లలో సుమది నెంబర్ 1 స్థానం. బుల్లితెర యాంకర్ గా.. సినిమా ఈవెంట్స్ వ్యాఖ్యాతగా.. రెండు చేతులా సంపాదిస్తోంది సుమ. అయితే ఇటీవల సుమకు ఎదురీదే క్రమంలో కొత్తతరం యాంకర్లు అందాల ఆరబోతతో వెనకాడడంలేదు. బుల్ల్లితెరపై కనిపించే చాలామంది ఫీమేల్ నటీమణులు తెరపై ఇలాగే కనిపించడానికి ప్రధాన్యత ఇస్తున్నారు. దీంతో ఈ మధ్య సుమ కూడా కాస్త రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల తెరపై కొంత గ్లామర్ గా కనిపించేందుకు సుమ ట్రై చేస్తుంది. సుమను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి ఈ విషయం తెలిసే ఉంటుంది.

Anchor-Suma-Shocked

ఇక ఓ ప్రముఖ ఛానల్ లో సుమ యాంకర్ గా చేస్తున్న ప్రోగ్రామ్స్ మరీ గాడి తప్పుతున్నాయి. ఓ ప్రోగ్రామ్ లో సుమ స్టూడెంట్స్ ని అడిగే ప్రశ్నలు.. వాటికి వాళ్లిచ్చే సమాధానాలు.. తిరిగి సుమ ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ కాస్త శ్రుతి మించుతున్నాయి. కాస్తోకూస్తో డబుల్ మీనింగ్ డైలాగులకు ప్రోగ్రామ్ వేదికగా మారింది. సుమ కూడా అలాంటి సందర్భాల్లో మరింత ఫోకస్డ్ గా ఉంటోంది. అర్థం కానీ వాళ్లకి బూతును భూతద్దంతో చూపించే ప్రయత్నం కూడా సుమ యాంకరింగ్ చేస్తున్న కార్యక్రమాల్లో కనిపిస్తోంది. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఎక్కువై పోవడంతో.. రేటింగుల కోసం యాజమాన్యాలు నానా వేషాలు వెయ్యడం పరిపాటిగా మారింది. అయితే యాంకర్లు మరీ ఇంతలా దిగజారడం ఎందుకో అర్థం కావడంలేదు.

Courtesy – YOYO TV

- Advertisement -