నది దాటాలంటే నరకమే…

171
- Advertisement -

మాములు సమయంలోనే అక్కడి ప్రజలకు ఊరి నుంచి బయటకు వెళ్లాలంటే నరకం.ఇక వర్షాకాలం వచ్చిందంటే వారి బాధలు వర్ణణాతీతం. ఓ వైపు జోరుగా కురుస్తున్న వర్షాలు…నదులు ఉగ్రరూపం దాల్చుతుండటంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయి. బతుకు దెరువు కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నది దాటుతున్నారు.

bridge bastar

ఇది చత్తీస్ గడ్‌లోని బస్తర్‌ జిల్లా వాసుల దుస్థితి. ఎవరు పట్టించుకునే వారు లేకపోవడంతో గ్రామస్తులే వైర్లతో కూడిన బ్రిడ్జిని తయారుచేసుకున్నారు. బిక్కుబిక్కు మంటూ వైరు మీద నుంచి వెళుతు నదిని దాటుతున్నారు. ఏ చిన్న పోరపాటు జరిగినా ప్రాణాలు నదిలో కలిసినట్లే.

river maharsthra

ఇది మహారాష్ట్రలోని గచ్చిరౌలీ జిల్లాలో దృశ్యం.వర్షాకాలంలో గ్రామస్తులు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే నరకయాతన పడుతున్నారు. సాధారణ రోజుల్లో ముడుకుల లోతు నీటిలో నది దాటాల్సిందే. ఇక వర్షాకాలంలో పలు ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. బతుకు దెరువు కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టి దేవుడా అంటూ నదిని దాటుతున్నారు. ఏ మాత్రం నది ప్రవాహం పెరిగిన…అజాగ్రత్తగా వ్యవహరించిన విగతజీవితా మారటం ఖాయం. ప్రభుత్వాలు స్పందించి తమ సమస్యను తీర్చాలని వేడుకుంటున్నారు.

CsXjhBIVIAEKWQP

- Advertisement -